UPI Payments: యూపీఐ నగదు చెల్లింపుల్లో ఆ తప్పు చేశారా..? ఈ టిప్స్ పాటిస్తే మీ సొమ్ము వాపస్

భారతదేశంలో 2016లో నోట్లను రద్దు చేశాక ఆన్‌లైన్ చెల్లింపులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ అందుబాటులోకి తీసుకువచ్చిన యూపీఐ పేమెంట్స్ సదుపాయం ద్వారా చాలా మంది నగదును ఈజీగా బదిలీ చేస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ చెల్లింపుల వల్ల దేశంలో చిల్లర సమస్యకు చెక్ పడినట్లు అయ్యింది.

UPI Payments: యూపీఐ నగదు చెల్లింపుల్లో ఆ తప్పు చేశారా..? ఈ టిప్స్ పాటిస్తే మీ సొమ్ము వాపస్
UPI
Follow us
Srinu

|

Updated on: Aug 12, 2024 | 9:19 PM

భారతదేశంలో 2016లో నోట్లను రద్దు చేశాక ఆన్‌లైన్ చెల్లింపులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ అందుబాటులోకి తీసుకువచ్చిన యూపీఐ పేమెంట్స్ సదుపాయం ద్వారా చాలా మంది నగదును ఈజీగా బదిలీ చేస్తున్నారు. ముఖ్యంగా యూపీఐ చెల్లింపుల వల్ల దేశంలో చిల్లర సమస్యకు చెక్ పడినట్లు అయ్యింది. అలాగే వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ కూడా బ్యాంకునకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యూపీఐ చెల్లింపులు ద్వారా చేయడం ప్రజలకు అలవాటు అయ్యింది. అయితే యూపీఐ ద్వారా ఒక వ్యక్తికి పంపబోయి వేరే వ్యక్తికి నగదును బదిలీ చేస్తే అవి తిరిగి రావు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ, నిర్ధిష్ట విధానాన్ని పాటించడం ద్వారా మనం పొరపాటున వేరే వ్యక్తికి బదిలీ చేసిన సొమ్మును వాపస్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా వేరే వ్యక్తికి బదిలీ చేసిన సొమ్మును ఎలా వాపసు పొందవచ్చో? ఓసారి తెలుసుకుందాం.

యూపీఐ ద్వారా బదిలీ చేసిన నగదు వాపసు పొందడం ఇలా

  • మీరు ముందుగా ఏ యాప్ ద్వారా నగదు బదిలీ చేశారో? ఆ యాప్‌లో లావాదేవీ నెంబర్ ద్వారా టిక్కెట్ రైజ్ చేసి కంప్లైంట్ చేయాలి. 
  • అనంతరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘వివాద పరిష్కార యంత్రాంగం’ విభాగాన్ని సెలెక్ట్ చేసి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి. లావాదేవీ ఐడీ, వర్చువల్ చెల్లింపు చిరునామా, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో సహా అవసరమైన వివరాలను అందించాలి. అనంతరం అకౌంట్‌లో సొమ్ము బదిలీ జరిగినట్లు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అప్‌లోడ్ చేయాలి.
  • అక్కడ మీ ఫిర్యాదుకు కారణం ‘మరో ఖాతాకు తప్పుగా బదిలీ చేయబడింది’ ఎంచుకోవాలి. అనంతరం మీ ఫిర్యాదు పరిష్కారమవుతుంది. 
  • ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే ముందుగా టీపీఏపీ, తర్వాత పీఎస్‌పీ బ్యాంక్ (చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్), అనంతరం బ్యాంకును సమస్య పరిష్కారం కోసం సంప్రదించాలి. 
  • ఒక నెల తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే లేదా ప్రతిస్పందనతో మీరు అసంతృప్తి చెందితే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ని సంప్రదించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..