AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: తక్కువ క్రెడిట్ స్కోర్‌తో బోలెడు సమస్యలు.. ఈ టిప్స్‌ పాటిస్తే సమస్యలు ఫసక్..!

భారతదేశంలో ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు కస్టమర్ చెల్లింపు పరిస్థితిని తెలుసుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే లోన్ తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తూ ఉంటాయి.

Credit Score: తక్కువ క్రెడిట్ స్కోర్‌తో బోలెడు సమస్యలు.. ఈ టిప్స్‌ పాటిస్తే సమస్యలు ఫసక్..!
Credit Score
Nikhil
|

Updated on: Aug 12, 2024 | 9:53 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు కస్టమర్ చెల్లింపు పరిస్థితిని తెలుసుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే లోన్ తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులు లోన్ ఇవ్వడానికి కస్టమర్ క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాయి. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే చాలా సింపుల్‌గా రుణాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. కస్టమర్లు చేసే కొన్ని తప్పల కారణంగా తక్కువ సిబిల్ స్కోర్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో లోన్ రిజెక్ట్ కాకుండా ఉండడానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ ఎలా మెయింటెన్ చేయాలో? ఓసారి తెలుసుకుందాం.

బిల్లుల చెల్లింపు

మంచి క్రెడిట్ స్కోర్ మెయింటేన్ చేయాలంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర బకాయిలను సకాలంలో చెల్లించాలని నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులు ఆలస్యంగా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వివరిస్తున్నారు. 

క్రెడిట్ కార్డుల వినియోగం

కస్టమర్లు వారి వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల్లో వినియోగ పరిమితిని 30 శాతం కంటే తక్కువ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక క్రెడిట్ వినియోగం ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుందని తద్వారా క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

రుణాల మిశ్రమం

సాధారణంగా మన అవసరానికి సంబంధించి తీసుకున్న రుణాలు మన క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.  సెక్యూర్డ్ రుణాలు అంటే గృహ రుణాలు వంటివి, అలాగే అసురక్షిత క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డ్‌ల వంటివి ఉపయోగించే సమయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల తీసుకునే సమయంలో మనకు అవసరమైన క్రెడిట్‌ను మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు. 

లోన్ అప్లికేషన్ల వినియోగం

మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తాడు. ఫలితంగా మీ రుణ అవసరాన్ని బేరీజు వేసుకుని మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది. అందువల్ల లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు 15 రోజుల వ్యవధిలోనే మీకు అవసరమైన బ్యాంకులకు వెళ్లి రుణ వడ్డీ రేట్లను కనుగొనడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ తగ్గదని నిపుణులు పేర్కొంటున్నారు. 

క్రెడిట్ నివేదిక

లోపాలు లేదా అనధికారిక లావాదేవీలు లేవని నిర్ధారించుకోవడానికి మీ క్రెడిట్ నివేదికను కాలానుగుణంగా సమీక్షించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు ఏవైనా వ్యత్యాసాలను కనుగొంటే వాటిని సరిదిద్దడానికి వెంటనే సంబంధిత ఏజెన్సీకు నివేదించాలని సూచిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..