Rental agreement: అద్దె ఒప్పందం 11 నెలలకే ఎందుకు చేసుకుంటారో తెలుసా.?
రెంటల్ అగ్రిమెంట్‌లో యజమాని పేరు, చిరునామా, అద్దె మొత్తం ఎంత.? ఎంత వ్యవధి కోసం అద్దె తీసుకుంటున్నారు, ఇంకా ఏమైనా ఇతర నిబంధనలు లేదా షరతులు ఉంటే వాటిని అందులో పేర్కొంటారు. అద్దె ఒప్పందం అనేది ఒక రకమై లీజు ఒప్పందం లాంటిది. వీటిని వైట్ పేపర్స్‌పై లేదా, బాండ్ పేపర్‌పై రాసి సాక్ష్యుల మధ్య ఒప్పందాలు చేసుకుంటారు...
ఇంటి కోసం లేదా దుకాణం కోసం అద్దెకు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. దేశంలో చాలా సొంతింటిలో ఉంటున్న వారి కంటే, సొంత దుకాణాల్లో వ్యాపారాలు చేస్తున్న వారి కంటే అద్దె ఇంట్లో ఉంటున్న వారే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అద్దెకు తీసుకునే సమయంలో రెంటల్ అగ్రీమెంట్ చేసుకుంటారని మనకు తెలిసిందే. అద్దెకు ఇచ్చే వారికి, అద్దె తీసుకునే వారి మధ్య ఈ ఒప్పందం జరుగుతుంటుంది.
రెంటల్ అగ్రిమెంట్‌లో యజమాని పేరు, చిరునామా, అద్దె మొత్తం ఎంత.? ఎంత వ్యవధి కోసం అద్దె తీసుకుంటున్నారు, ఇంకా ఏమైనా ఇతర నిబంధనలు లేదా షరతులు ఉంటే వాటిని అందులో పేర్కొంటారు. అద్దె ఒప్పందం అనేది ఒక రకమై లీజు ఒప్పందం లాంటిది. వీటిని వైట్ పేపర్స్‌పై లేదా, బాండ్ పేపర్‌పై రాసి సాక్ష్యుల సమక్షంలో ఒప్పందాలు చేసుకుంటారు. అయితే చాలా వరకు రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలల వ్యవధికి మాత్రమే చేసుకుంటారు.
అయితే 11 నెలలకే రెంటల్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారన్న దానిపై ఎప్పుడైనా సందేహం వచ్చిందా.? దీని వెనకాల అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 11 నెలలకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి కారణాల్లో రిజిస్ట్రేషన్ చట్టం 108 ఒకటి. రిజిస్ట్రేషన్ చట్టం 1908లో సెక్షన్ 17 నిబంధనల ప్రకారం ఏడాది కంటే తక్కువ లీజు ఒప్పందం చేసుకోవడం కుదరదు.
ఏడాదికి లీజు ఒప్పందం చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా కాస్త వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం కావడంతో చాలా మంది కేవలం 11 నెలలకే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తిరిగి 11వ తనెల పూర్తి కాగానే మళ్లీ, మరో 11 నెలలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇదండీ 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ వెనకాల ఉన్న అసలు ఉద్దేశం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..