Hindenburg: సెబీ ఛైర్‌పర్సన్‌పై మరో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్.. సంచలనం సృష్టిస్తున్నకీలక ఆరోపణలు
హిండెన్ బర్గ్ నివేదిక సంచలనం రేపుతోంది. దీని ప్రకటన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు అదానీ గ్రూప్ కి కూడా హిండెన్ బర్గ్ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ వచ్చేలా చేస్తోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారతదేశ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాదబి పూరీ బుచ్‌తో తన వైరాన్ని పెంచుకుంది. అదానీ గ్రూప్‌తో ముడిపడి ఉన్న ప్రయోజనాలకు సంబంధించిన వైరుధ్యాలు, ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు గుప్పించింది..
హిండెన్ బర్గ్ నివేదిక సంచలనం రేపుతోంది. దీని ప్రకటన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు అదానీ గ్రూప్ కి కూడా హిండెన్ బర్గ్ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ వచ్చేలా చేస్తోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారతదేశ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాదబి పూరీ బుచ్‌తో తన వైరాన్ని పెంచుకుంది. అదానీ గ్రూప్‌తో ముడిపడి ఉన్న ప్రయోజనాలకు సంబంధించిన వైరుధ్యాలు, ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు గుప్పించింది. ఏడాదిన్నర క్రితం భారత్ ను ఓ ఊపు ఊపిన హిండెన్ బర్గ్.. తాజాగా మరోసారి సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి, ఆమె భర్తపై చేసిన ఆరోపణలు మరోసారి దూమారం రేపుతున్నాయి. ఆదివారం రాత్రి యూఎస్ బేస్డ్ ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇప్పుడు మరో బాంబు పేల్చింది. సమ్ థింగ్ బిగ్ అంటూ ఓ ట్వీట్ ద్వారా హింట్ ఇచ్చి మరోసారి భారత్ ను కుదిపేసే నివేదికను విడుదల చేసింది. సెబీ ఛైర్మన్ మాధవి పురి టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అదానీ గ్రూప్ షేర్ల వాల్యూని పెంచేందుకు వాడిన ఆఫ్ షోర్ పనులను సెబీ ఛైర్మన్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించడంతో సంచలనంగా మారింది.
అయితే ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధబి బచ్ పురి చేసిన ప్రకటన మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై ఆ సంస్థ ఆదివారం రాత్రి మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు బెర్మడా/మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. దీంతోపాటు ఆ ఫండ్స్‌ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం అతను అదానీ గ్రూపులో డైరెక్టర్‌గా చేస్తున్నారని కూడా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది.
అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారు. వాటిల్లో బచ్ వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్లు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని వెల్లడించింది. అలాగే ఆమె 2019లో భర్త సదరు సంస్థల బాధ్యతను స్వీకరించారని వెల్లడించింది.
SEBI Chairperson Madhabi Buch’s response to our report includes several important admissions and raises numerous new critical questions.
(1/x) https://t.co/Usk0V6e90K
— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024
హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ మాధబి
ఇదిలా ఉండగా, ఇండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను సెబీ ఛైర్‌పర్సన్ మాధబి ఖండించారు. చేసిన ఆరోపణలన్ని అవాస్తవమని ప్రకటించారు. ఈ సందర్భంగా మాధబి, ఆమె భర్త సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజాలు లేవని స్పష్టం చేశారు.