Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి ? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?

సెబీ చైర్‌పర్సన్ మధాబీ పూరీ బుచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా అదానీ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ వాటాలు ఉన్నాయని ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం విడుదల చేసిన రిపోర్టు సంచలనంగా మారింది. ఇంతకి హిండెన్‌బర్గ్‌ అంటే ఏమిటి?..

Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి ? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?
Hindenburg
Follow us
Subhash Goud

|

Updated on: Aug 12, 2024 | 8:40 AM

సెబీ చైర్‌పర్సన్ మధాబీ పూరీ బుచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా అదానీ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ వాటాలు ఉన్నాయని ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం విడుదల చేసిన రిపోర్టు సంచలనంగా మారింది. ఇంతకి హిండెన్‌బర్గ్‌ అంటే ఏమిటి? దీని పని ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసే పని ఏంటి..?

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది న్యూయార్క్ ఆధారిత పెట్టుబడి సంస్థ. దీనిని ‘షార్ట్ సెల్లర్’గా పిలుస్తారు. ఇది మార్కెట్లోని అవకతవలను గుర్తించి బయటపెడుతుంది. తద్వారా షార్ట్ సెల్లింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీని నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి స్థాపించారు. ఇది ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ, కార్పొరేట్ మోసాలు వెలికితీయడంలో దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. 2017లో స్థాపించినన, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రపంచ వ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీలు పాల్పడిన అవకతవకలను బయట పెడుతుంది.

ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలను అందించడానికి తాము వినూత్న విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తామని హిండెన్ బర్గ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలలో జరిగే అకౌంటింగ్ మోసాలు, సర్వీస్ ప్రొవైడర్ అక్రమాలు, చట్టవిరుద్ధమైన, అనైతిక వ్యాపార కార్యకలాపాలను బయటపెట్టడమే తమ లక్ష్యమని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ యజమాని ఎవరు?

2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. అతన్ని నేట్ ఆండర్సన్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని కనెక్టికట్ యూనివర్శిటీలో చదివిన నాథన్, ఫ్యాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్టమ్ అనే డేటా సంస్థతో కెరీర్ ప్రారంభించి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో కలిసి పనిచేశారు. వాల్ స్ట్రీట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అండర్సన్ తన ఉద్యోగ సమయంలో ఈ వ్యక్తులు (అతను పనిచేసిన కంపెనీలో) చాలా సరళమైన విశ్లేషణ చేస్తున్నారని గ్రహించారు. దీని తర్వాత ఆయన స్వంత సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి