Hindenburg: సెబీ ఛైర్‌పర్సన్‌ఫై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు.. సరికొత్త వివాదం తెరపైకి..
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆదానీ కంపెనీల్లో మాధబి పురి బచ్‌కు వాటా ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తోంది. మారిషస్‌లో సెబీ చీఫ్ మాధబి పురి పెట్టుబడులు పెట్టారని చెబుతోంది. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇంకో బాంబు పేల్చింది. భారత్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆదానీ కంపెనీల్లో మాధబి పురి బచ్‌కు వాటా ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తోంది. మారిషస్‌లో సెబీ చీఫ్ మాధబి పురి పెట్టుబడులు పెట్టారని చెబుతోంది. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇంకో బాంబు పేల్చింది. భారత్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ సారి సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలు ఉన్నాయంటోంది హిండెన్‌బర్గ్.
ఇది కూడా చదవండి: IT Sector: దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోలు వీరే.. జీతాలు చెల్లింపుల్లో ఈ కంపెనీలు అగ్రస్థానం
ఈ పరిణామంతో భారత్‌లో ప్రకంపనలు మొదలవడం ఖాయం. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ సమయంలో అదానీ షేర్ వాల్యూ భారీగా పతనమైంది. దీంతో సుప్రీంకోర్టు.. సెబీ దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో.. వెంటనే విచారణను జరిపింది. ఒకటి కాదు రెండు కాదు.. గౌతమ్ అదానీ అండర్‌లో ఉన్న ప్రతీ కంపెనీని విచారణ జరిపింది. చివరకు అదానీ ఏ తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చింది సెబీ. ఆ తర్వాత అదానీ షేర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే హిండెన్‌బర్గ్ ఏకంగా సెబీ చైర్మన్ పైనే ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఆమె అదానీ షేర్లు కలిగిఉన్నట్లు ఆరోపణలు చేస్తోంది. దీంతో మరోసారి మార్కెట్లు కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు గతంలో సెబీ జరిపిన విచారణపైనా అనుమానాలు మొదలవుతున్నాయి. దీంతో సోమవారం నాడు ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా ఉంది. ఇప్పటికే హిండెన్‌బర్గ్‌పై పోరాటం చేస్తోంది అదానీ సంస్థ. ఇప్పుడు కొత్త ఆరోపణలతో ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
విదేశాల్లో అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారో తమకు తెలియదని గతంలో సెబీ చేసిన కామెంట్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తోంది హిండెన్‌బర్గ్. ఆ సీక్రెట్ పెట్టుబడుల ద్వారా అదానీ షేర్ ప్రైస్‌ను కృత్రిమంగా పెంచారంటూ ఆరోపిస్తోంది. అయితే ఆ పెట్టుబడులు స్వయంగా సెబీచైర్మన్ కుటుంబం నుంచే జరిగాయని సంచలనం రేపుతోంది. ఈపరిణామాలు ఎక్కడివరకు దారి తీస్తాయో చూడాలి. అయితే అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Post Office scheme: ఈ స్కీమ్‌తో లక్షాధికారి కావచ్చు.. రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి