AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Vande Bharat: 20 కోచ్‌లతో వందే భారత్ మొదటి రైలు.. ఈ మార్గంలో ట్రయల్ రన్

దేశంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రారంభమైన ఈ రైలు.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు దేశంలో 102 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు..

New Vande Bharat: 20 కోచ్‌లతో వందే భారత్ మొదటి రైలు.. ఈ మార్గంలో ట్రయల్ రన్
Vande Bharat
Subhash Goud
|

Updated on: Aug 10, 2024 | 3:47 PM

Share

అహ్మదాబాద్ – ముంబై మధ్య 20 కోచ్‌లతో మొదటి వందే భారత్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ వందే భారత్ మొదటి ట్రయల్ రన్‌లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచింది. రైలు ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ బయలుదేరింది. ప్రస్తుత వందే భారత్ రైలులో పెద్ద నగరాల్లో 16 కోచ్‌లు, చిన్న నగరాల మధ్య 8 కోచ్‌లు ఉండనున్నాయి. ఇప్పటి వరకు 16 కోచ్‌లతో రెండు వందేభారత్ రైళ్లు అహ్మదాబాద్ – ముంబై మధ్య నడుస్తున్నాయి.

20 కోచ్ సెమీ హైస్పీడ్ రైలు కలుపూర్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరింది. రైలు అహ్మదాబాద్, వడోదర, సూరత్ మీదుగా ముంబై సెంట్రల్ స్టేషన్‌కు మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంది. ట్రయల్ రన్ కోసం 14C+2Eతో పాటు అదనంగా నాలుగు C కోచ్‌లు జోడించారు. ట్రయల్ రన్ సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అహ్మదాబాద్ – ముంబై మధ్య రైల్వే క్రాసింగ్‌లు, స్టేషన్ల వద్ద రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) సిబ్బందిని మోహరించారు.

వందే భారత్‌ను ప్రతి రాష్ట్రంలో..

ఇవి కూడా చదవండి

ప్రతి రాష్ట్రంలో వందేభారత్ రైళ్లను నడుపుతున్నామని, ఎలాంటి వివక్ష చూపడం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో పార్లమెంటులో చెప్పారు. స్వల్ప-దూర నగరాల మధ్య ప్రాంతీయ రైళ్ల తరహాలో వందే మెట్రోను నడపాలని నిర్ణయించామని, వీటి మధ్య దూరం 150 నుంచి 200 కిలోమీటర్లు ఉంటుందని, దీని రూపకల్పన చేసి పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన పార్లమెంట్‌లో ప్రకటించారు. త్వరలో వందే మెట్రో ప్రారంభిస్తామని, అనేక ఫీచర్లతో ప్రయాణికులకు వరంగా మారుతుందని వైష్ణవ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Post Office scheme: ఈ స్కీమ్‌తో లక్షాధికారి కావచ్చు.. రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు!

రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ‘జులై 29, 2024 నాటికి, భారతీయ రైల్వేలు 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుస్తుననాయి. రాష్ట్రాలను బ్రాడ్ గేజ్ (బిజి) ఎలక్ట్రిఫైడ్ నెట్‌వర్క్‌తో కలుపుతున్నాయి. ఈ రైళ్లను ప్రస్తుతం 760 కి.మీ.ల దూరం వరకు నడుపుతున్నారు.’ రాజధాని, ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్లు వస్తాయా అని ఎంపీ సీవీ షణ్ముగం ప్రశ్నించారు. ‘ఇప్పటికే ఉన్న రైలు సర్వీసుల స్థానంలో కొత్త వందే భారత్ సర్వీసులు ప్రారంభించాం’ అని రైల్వే మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: IT Sector: దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోలు వీరే.. జీతాలు చెల్లింపుల్లో ఈ కంపెనీలు అగ్రస్థానం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి