UPI Payments: బయోమెట్రిక్, ఫేస్ ఐడీతోనూ యూపీఐ పేమెంట్లు.. త్వరలో అందుబాటులోకి..

యూపీఐ లావాదేవీలను త్వరలోనే స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించి చేసుకునే వీలు కలుగనుంది. ఈ మేరకు యూపీఐ చెల్లింపులను ప్రామాణీకరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పలు యూపీఐ కంపెనీలతో మాట్లాడుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

UPI Payments: బయోమెట్రిక్, ఫేస్ ఐడీతోనూ యూపీఐ పేమెంట్లు.. త్వరలో అందుబాటులోకి..
Upi
Follow us

|

Updated on: Aug 10, 2024 | 4:16 PM

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ).. మన దేశంలో ఒక విప్లవమనే చెప్పాలి. అసలు బ్యాంకింగ్ లావాదేవీలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మారు మూల పల్లెలకు డిజిటల్ పేమెంట్ వ్యవస్థను తీసుకెళ్లగలిగామంటే ఈ యూపీఐ ఆవిష్కరణే మూలం. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ ఆధారంగానే సులభంగా లావాదేవీలు చేసేస్తున్నారు. మన దేశంలో బిలియన్ల కొద్దీ వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. బిలియన్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. సాధారణంగా యూపీఐలో లావాదేవీ చేయడానికి పిన్ నంబర్ వాడుతున్నాం. అయితే దానికి అదనంగా కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు యూపీఐ రన్నింగ్ బాడీ పేర్కొంది. త్వరలోనే పెద్ద అప్ గ్రేడ్ చూస్తామని చెబుతున్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చేలా.. మరింత సురక్షితంగా లావాదేవీలు చేసుకునేందుకు వీలుగా ఈ అప్ గ్రేడ్ ఉంటుందని తెలుస్తోంది.

స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ ఫీచర్లు..

యూపీఐ లావాదేవీలను త్వరలోనే స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించి చేసుకునే వీలు కలుగనుంది. ఈ మేరకు యూపీఐ చెల్లింపులను ప్రామాణీకరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పలు యూపీఐ కంపెనీలతో మాట్లాడుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. స్మార్ట్ ఫోన్ బయో మెట్రిక్స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఐడీ, ఐఫోన్ అయితే ఫేస్ ఐడీలను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేసేలా కొత్త ఫీచర్లు రానున్నాయి. ఇటీవల యూపీఐ పేమెంట్లలో జరుగుతున్న పలు స్కామ్ కారణంగా యూపీఐ అధికార యంత్రాంగం ఈ మేరకు కొత్త భద్రత ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇలా..

ప్రస్తుతం యూపీఐ మెకానిజం సురక్షితంగానే ఉంది. ప్రత్యేకమైన నాలుగు లేదా ఆరు అంకెల పిన్‌ని ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నారు. అయినప్పటికీ అనుకోని విధంగా స్కామర్లు వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. నకిలీ యూపీఐ చెల్లింపు స్కామ్ వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు. అందుకే కొత్త భద్రత ఫీచర్ల అవసరాన్ని యూపీఐ అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ నేపత్యంలో యూపీఐ చెల్లింపులకు ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ భద్రత మంచి మార్గమని ఎన్పీసీఐ ఆలోచిస్తోంది. అయితే యూపీఐ యాప్‌లలో ఫేస్ ఐడీ ఇంటిగ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..