SEBI Chairperson: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన సెబీ చైర్‌పర్సన్

హిండెన్‌బర్గ్ కొత్త నివేదిక మళ్లీ సంచలనం సృష్టించింది. ఈసారి, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీ, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌పై ఆరోపణలు చేసింది. మాధవి పూరి బుచ్, ధవల్ బుచ్ శనివారం అర్థరాత్రి వచ్చిన నివేదికలను 'నిరాధారమైనవి' అని పేర్కొన్నారు. అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన..

SEBI Chairperson: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన సెబీ చైర్‌పర్సన్
Sebi Chairperson
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2024 | 11:08 AM

హిండెన్‌బర్గ్ కొత్త నివేదిక మళ్లీ సంచలనం సృష్టించింది. ఈసారి, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీ, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌పై ఆరోపణలు చేసింది. మాధవి పూరి బుచ్, ధవల్ బుచ్ శనివారం అర్థరాత్రి వచ్చిన నివేదికలను ‘నిరాధారమైనవి’ అని పేర్కొన్నారు. అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన ఆఫ్‌షోర్ నిధులలో సెబీ చైర్‌పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త వాటా కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Hindenburg: సెబీ ఛైర్‌పర్సన్‌ఫై హిండెన్‌బర్గ్‌ సంచలన ఆరోపణలు.. సరికొత్త వివాదం తెరపైకి..

సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ఎలాంటి ఆర్థిక పత్రాలను చూపించడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. సెబీ షోకాజ్ నోటీసు, చర్యకు ప్రతిస్పందనగా హిండెన్‌బర్గ్ తమకు ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. ‘ఆగస్టు 10, 2024 నాటి హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలపై నివేదికలో చేసిన నిరాధార ఆరోపణలను తాము ఖండిస్తున్నామని అన్నారు. అందులో వాస్తవం లేదన్నారు. మన జీవితం, ఆర్థిక పరిస్థితి తెరిచిన పుస్తకం లాంటిదని, ఆర్థిక పత్రాలన్నీ చూపించడంలో మాకు ఎలాంటి సందేహం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

ఈసారి హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఏంటి?

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆగస్టు 10న తన కొత్త నివేదికలో అదానీ ‘మనీ సైఫనింగ్ స్కాండల్’లో ఉపయోగించిన ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌కు వాటా ఉందని ఆరోపించింది. సెబీ చైర్‌పర్సన్ మధాబీ పూరీ బుచ్ అదానీ గ్రూప్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో పెట్టుబడులను కలిగి ఉన్నందున జనవరి 2023లో ప్రచురించబడిన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్య తీసుకోవడానికి సెబీ సుముఖంగా లేదని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. జనవరి 2023 నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్, దాని ఛైర్మన్ గౌతమ్ అదానీ అనేక సందర్భాల్లో ఖండించారు.

ఇది కూడా చదవండి: Post Office scheme: ఈ స్కీమ్‌తో లక్షాధికారి కావచ్చు.. రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి