AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jan Dhan Yojana: మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా..? రీ కేవైసీ చేయించకపోతే ఏమవుతుందో తెలుసా..?

జన్ ధన్ యోజన పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆర్బీఐ ఇప్పుడు జన్ ధన్ ఖాతాలను రీ-కేవైసీ చేయమని చెప్పింది. దీని కోసం బ్యాంకులు పంచాయతీ స్థాయిలో క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఆన్‌లైన్‌లో దీన్ని ఎలా చేయాలి..? చేయకపోతే ఏమవుతుంది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Jan Dhan Yojana: మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా..? రీ కేవైసీ చేయించకపోతే ఏమవుతుందో తెలుసా..?
Jan Dhan Account Re Kyc
Krishna S
|

Updated on: Aug 08, 2025 | 6:46 PM

Share

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. జన్ ధన్ ఖాతాల రీ-కేవైసీ చేయించుకోవాలని సూచించింది. దీనివల్ల ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలలో ఎటువంటి సమస్య ఉండదు. మీకు జన్ ధన్ ఖాతా ఉంటే ఖచ్చితంగా రీ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అటు ప్రభుత్వ పథకాలను సైతం పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. జన్ ధన్ ఖాతాల రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి బ్యాంకులు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తాయి. మీరు ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో లేదా బ్యాంకులు నిర్వహించే క్యాంపులకు వెళ్లి చేయించుకోవచ్చు.

రీ-కేవైసీ క్యాంపులు..?

జన్ ధన్ ఖాతాల కోసం ప్రతి పంచాయతీ స్థాయిలో జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు స్వయంగా గ్రామాలకు వెళ్లి జన్ ధన్ ఖాతాదారుల కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ శిబిరాల్లో, జన్ ధన్ ఖాతాల రీ-కెవైసితో పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి స్కీమ్స్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. దీనితో పాటు ఆర్థిక అవగాహన, ఫిర్యాదు పరిష్కార సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

రీ-కేవైసీ అంటే ఏమిటి?

రీ-కేవైసీలో మీ గుర్తింపు కార్డు, చిరునామా సమాచారాన్ని మళ్ళీ బ్యాంకుకు సమర్పించాలి. మీ డాక్యుమెంట్స్ పాతవి లేదా చిరునామా మారినట్లయితే.. ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. రీ-కెవైసికి అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డ్, ఓటరు ఐడీ, పాన్ కార్డ్ వంటి ఉన్నాయి. రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటివి చిరునామా రుజువు అవసరం అవుతాయి.

ఆన్‌లైన్‌లో రీ-కేవైసీ ఎలా..?

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారు అయితే.. మీరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్ ద్వారా కేవైసీ చేయవచ్చు. OTP ఆధారిత ఇ-కేవైసీ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు వీడియో కేవైసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఇలా చేయండి..

  • ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
  • మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • “అందులో అప్‌డేట్ కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • కేవైసీ అప్‌డేట్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
  • వివరాలను ఫిల్ చేసి.. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అప్‌లోడ్ చేయాలి.
  • డాక్యుమెంట్స్‌లలో ఏదైనా మార్పు ఉంటే.. మీరు బ్రాంచ్‌ను సందర్శించి స్వీయ-ప్రకటన ఫామ్‌ని కూడా పూరించాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..