AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు ద్వారా సెకన్లలోనే మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా ఈజీ..

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. మీ ఆధార్ నెంటర్, బయోమెట్రిక్స్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందనే విషయం చాలామందికి తెలియదు.

Aadhaar Card: ఆధార్ కార్డు ద్వారా సెకన్లలోనే మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా ఈజీ..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 5:55 PM

Share

ఆధార్ కార్డు అనేది కేవలం 12 అంకెల నెంబర్ మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి వ్యక్తిని గుర్తించే ముఖ్యమైన ధృవీకరణ పత్రం. ఒక వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. మీ పేరు, తండ్రి పేరు, అడ్రస్, వేలిముద్రలు, కనుపాపలు వంటి బయోమెట్రిక్ సమాచారం మొత్తం జోడించి ఉంటుంది. దీంతో ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేట్ సర్వీసులు పొందాలన్నా ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఆధార్ కేవలం గుర్తింపు ధృవీకరణ పత్రంగానే కాకుండా ఆర్ధిక లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల నగదు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడేందుకు ఆధార్ ఉపయోగపడుతుంది. అలాగే చాలా చోట్ల మీరు ఆధార్ కార్డు సహాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మరొక ఖాతాకు బదిలీ చేయవచ్చు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆధార్ నెంబర్ ద్వారా డబ్బులు ఎలా..?

ఆధార్ నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌లో లింక్ చేయడం అనేది తప్పనిసరిగా మారింది. ఇది చేయకపోతే మీరు ప్రభుత్వ పథకాల నగదు పొందలేరు. ఆధార్ కార్డు-బ్యాంక్ అకౌంట్ లింక్ వల్ల ప్రభుత్వ పథకాలకు అర్హులైన వ్యక్తుల పేర్లు DBT పోర్టల్‌కు అనుసంధానం చేయబడతాయి. బ్యాంకు అకౌంట్.. పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో ప్రభుత్వం మీ అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు DBT వ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఆ తర్వాత NPCI ద్వారా లబ్దిదారుడైన ఖాతాదారుడి అకౌంట్లో నిధులు జమ అవుతాయి. దీంతో వెంటనే డబ్బులు జమ అయినట్లు ఎస్‌ఎంఎస్ వస్తుంది.

డబ్బులు విత్ డ్రా చేసుకోవడం ఎలా..?

ఆధార్ కార్డు ద్వారా మన అకౌంట్లోని డబ్బులను విత్ డ్రా చేసుకునే మార్గం ఉంది. ఆధార్ కార్డును మీ బ్యాంకు అకౌంట్‌తో పాటు మొబైల్ నెంటర్‌కు లింక్ చేస్తారు. దీని ద్వారా మీరు ఆధార్ కార్డు ద్వారానే డబ్బులు విత్ డ్రా చేసుకోవడంతో పాటు ఇతరులకు బదిలీ చేయవచ్చు. అయితే బయట సర్వీసులు అందించేవారు ఇందుకోసం కొంతమొత్తంలో రుసుము వసూలు చేస్తారు. గ్రామాల్లో ఉండేవారికి ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై అవగాహన ఉండదు. అవగాహన ఉన్నా ఎలా ఉపయోగించాలనేది తెలియదు. ఇక దూరంగా పట్టణాల్లో ఉండే బ్యాంకుకు పదే పదే వెళ్లలేరు. దీంతో గ్రామాల్లో ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసి ఇచ్చే ఆపరేటర్లను సంప్రదిస్తూ ఉంటారు. దీని ద్వారా పని సులువవుతుంది. కానీ కొంతమొత్తం ఆపరేటర్లు ఛార్జీలు వసూలు చేస్తారు.

Follow Us