AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himanshu: కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం హిమాన్షు గేమ్స్ ఆడుతుండగా ముక్కుకు గాయం కావడంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతనికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

Himanshu: కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం కేసీఆర్
Kcr's Grandson Himanshu Suffers Nose Injury
Anand T
|

Updated on: Jul 07, 2026 | 5:41 PM

Share

మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డారు. సోమవారం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షు స్వల్పంగా గాయపడడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిమాన్షు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు హాస్పిటల్‌కు చేరుకున్నారు. అలాగే కేసీఆర్‌ సైతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హాస్పిటల్‌కు వెళ్లి మనవడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.

అయితే ఈ ప్రమాదంపై కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం స్పందించాడు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశాడు హిమాన్షు. సోమవారం రాత్రి చిన్నపాటి గాయం కారణంగా హాస్పిటల్‌లో చేర్చారని హిమాన్షు తెలిపాడు. గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని.. అంతవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు హిమాన్షు తెలిపాడు. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని హిమాన్షు పేర్కొన్నాడు.

అలాగే ఈ ఘటనపై అటు కేటీఆర్‌ సైతం స్పందించారు. సోమవారం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షుకు గాయం అయిందని.. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి కావాలని సూచించారని.. త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. హిమాన్షు ఆరోగ్యం గురించి అడిగిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us