AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: లక్షలోపు ధరతో హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అతి తక్కువ సమయంలో చార్జ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌

స్కూటర్లు అయినా.. కార్లు అయినా అధిక ధరలో ఉంటున్నాయి. సామాన్యుల బడ్జెట్ కు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. ఫలితంగా వాటిని కొనుగోళ్లు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ చవకైన స్కూటర్ ను ఆవిష్కరించింది. అంతేకాక దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది.

Electric Scooter: లక్షలోపు ధరతో హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అతి తక్కువ సమయంలో చార్జ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌
Hop Leo White
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 19, 2023 | 7:06 PM

Share

ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అందరూ పర్యావరణ హితమైన ఈ వాహనాల కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు, అవి బైక్ లు అయినా.. స్కూటర్లు అయినా.. కార్లు అయినా అధిక ధరలో ఉంటున్నాయి. సామాన్యుల బడ్జెట్ కు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. ఫలితంగా వాటిని కొనుగోళ్లు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ చవకైన స్కూటర్ ను ఆవిష్కరించింది. అంతేకాక దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. ఈ స్కూటర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే రెండు మోడళ్లు..

హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎల్ వైఎఫ్(Lyf) స్కూటర్, ఓక్సో(Oxo) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పేరిట ఉన్నాయి. ఇప్పుడు మూడో మోడల్ లియో(Leo) పేరిట లాంచ్ చేసింది. దీని ధర రూ. 97,000 నుంచి ప్రారంభమవుతుందని ఆ కంపెనీ ప్రకటించింది.

స్పెసిఫికేషన్లు ఇవి..

హాప్ లియో స్కూటర్ లో 72V BLDC హబ్ మోటార్ తో వస్తుంది. ఇది 2.2kW అవుట్ పుట్ తో పాటు 90Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 2.1kWh సామర్థ్యంతో లిథియం ఐయాన్ బ్యాటరీ వస్తుంది. ఇది వాటర్, రస్ట్ ప్రూవ్. దీనిలో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, పవర్, స్పోర్ట్స్, రివర్స్ అనే నాలుగు మోడ్లలో మంచి రైడింగ్ అనుభూతినిస్తాయి.

ఇవి కూడా చదవండి

రేంజ్ అల్టిమేట్..

ఈ స్కూటర్ లో 850 వాట్ల చార్జర్ ఉంటుంది. బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అవడానికి 2.5 గంటలు పడుతుంది. ఇక్కసారి ఫుల్ చార్జ్ అయితే దాదాపు 120 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. 10 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు ముందు వెనుక డిస్క్ బ్రేకులతో ఈ బండి వస్తుంది. దీనిలో రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. 160 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది. 160 కేజీల వరకూ బరువును మోయగల్గుతుంది.

పీచర్లు సూపర్..

హాప్ లియో స్కూటర్ లో ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది. అలాగే ఎల్సీడీ డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. బ్లాక్, వైట్, గ్రే, బ్లూ, రెడ్ వంటి ఐదు రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..