AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Interest: రుణాలపై పెరుగుతోన్న వడ్డీలు.. ఏ లోన్‌పై ఎంత వడ్డీ పెరుగుతుందంటే..

ఆర్బీఐ రేపో రేటును పెంచడంతో బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పెరిగిన వడ్డీ రేట్లతో ఏ రుణంపై ఎంత భారం పడుతుందో చూద్దాం....

Loan Interest: రుణాలపై పెరుగుతోన్న వడ్డీలు.. ఏ లోన్‌పై ఎంత వడ్డీ పెరుగుతుందంటే..
Interest Rates
Srinivas Chekkilla
|

Updated on: Jun 10, 2022 | 3:18 PM

Share

ఆర్బీఐ రేపో రేటు పెంచడంతో బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పెరిగిన వడ్డీ రేట్లతో ఏ రుణంపై ఎంత భారం పడుతుందో చూద్దాం. గృహావసరాల కోసం 30 లక్షల రూపాయల లోన్ తీసుకున్న వారి అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు 20 సంవత్సరాలకు ఏడుశాతం మేర పెరుగుతుంది. 30 లక్షల రూపాయల రుణానికి ఇప్పుడు 23,259 రూపాయల ఈఎంఐ చెల్లిస్తుంటే అది 24,907 రూపాయలకు చేరుతుంది. అంటే 1,648 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు SBI నుంచి 7.1 శాతం ప్రస్తుత వడ్డీ రేటుతో 30 సంవత్సరాల కాలవ్యవధికి రూ.20 లక్షల గృహ రుణం బాకీ ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు SBI హోమ్ లోన్ వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 8%కి పెంచితే కనుక ఇప్పుడు మీ హోమ్ లోన్ EMI రూ.13,441 నుంచి రూ.14,675కి చేరుకుంటుంది. అంటే ఇప్పటి నుంచి మీరు మీ ఈఎంఐ పై ప్రతి న్ఎలా రూ.1234 ఎక్కువ కట్టాల్సి వస్తుంది.

ఆటో, వాహన అవసరాల కోసం ఎనిమిది లక్షల రూపాయల రుణాలను తీసుకున్న వారి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు ఏడు సంవత్సరాలు ఉంటే- ఈఎంఐ 10 శాతం నుంచి 10.9 శాతానికి పెరుగుతుంది. ప్రతినెలా 13,281 రూపాయల ఈఎంఐ మొత్తాన్ని చెల్లించే రుణ గ్రహీతలు ఇకపై 13,656 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 375 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా SBI కార్ లోన్ వడ్డీ రేటు ఇప్పుడు సంవత్సరానికి 7.45 శాతం గా ఉంది. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.10 లక్షల కార్ లోన్‌ తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు SBI కార్ లోన్ వడ్డీ రేటు 7.45 శాతం నుంచి 8.35 శాతానికి పెంచితే మీ EMI కూడా రూ.8,025 నుంచి రూ.8,584కి పెరుగుతుంది. అంటే మీరు అదనంగా రూ.559 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.

వ్యక్తిగత (పర్సనల్) అవసరాల కోసం అయిదు లక్షల రూపాయల రుణాలను తీసుకున్న వారి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు అయిదు సంవత్సరాల వరకు ఉంటే నెలవారీ వడ్డీ రేటు 14 నుంచి 14.9 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం కడుతున్న 11,634 రూపాయల ఈఎంఐ 11,869 రూపాయలకు పెరుగుతుంది. అంటే 235 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది. SBI పర్సనల్ లోన్ ఇప్పుడు సంవత్సరానికి 7.05 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంది. ఈ వడ్డీ రేటు కనుక 7.95 శాతానికి పెరిగితే, 10 సంవత్సరాల కాలవ్యవధితో మీ పెండింగ్‌లో ఉన్న రూ.10 లక్షల పర్సనల్ లోన్ EMI రూ.11,637 నుంచి రూ.12,106కి పెరుగుతుంది. అంటే మీరు ప్రతి నెల రూ.469 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు 10 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 35 లక్షల రుణం బకాయి ఉందని అనుకుందాం. వడ్డీ రేటులో 0.9 శాతం పాయింట్ పెరుగుదల వడ్డీ భారాన్ని దాదాపు 8 శాతానికి పెరుగుతుంది. ఇక్కడ 35 లక్షలకు 7.1 శాతం వడ్డీరేటుతో EMI రూ. 40,818 అవుతుంది. మనం మొత్తం టెన్యూర్ కాలం 10 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం వడ్డీ రూ. 13.98 లక్షలుగా ఉంటుంది. ఇప్పుడు రేటు 90 బేసిస్ పాయింట్లు లేదా 0.9 శాతం పెరిగితే 8 శాతానికి చేరుకుంటుంది. దీంతో 10 సంవత్సరాల కాల పరిమితికి మన లోన్ రూ. 35 లక్షలపై ఈఎంఐ రూ. 42,465 అవుతుంది. అప్పుడు మనం చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ. 15.96 లక్షలు అవుతుంది. అంటే దాదాపుగా రెండు లక్షల రూపాయలు అదనపు భారం మనకు వడ్డీ రూపంలో మన హోమ్ లోన్ పై పడుతుంది.