No Startup Job: స్టార్టప్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు ‘నో’ చెబుతున్న టెక్కీలు.. బోర్ కొట్టినా వాటికే సై అంటున్నారు.. ఎందుకంటే..

No Startup Job: న్యూ ఏజ్ టెక్ స్టార్టప్‌ల మనుగడ అవకాశాలను ప్రభావితం చేసే విధంగా వాటి ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయి. వీటిపై సదరు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No Startup Job: స్టార్టప్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు 'నో' చెబుతున్న టెక్కీలు.. బోర్ కొట్టినా వాటికే సై అంటున్నారు.. ఎందుకంటే..
It Jobs
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 10, 2022 | 12:32 PM

No Startup Job: న్యూ ఏజ్ టెక్ స్టార్టప్‌ల మనుగడ అవకాశాలను ప్రభావితం చేసే విధంగా వాటి ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయి. వీటిపై సదరు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తిరిగి పెద్ద కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి పనిచేయడానికి వెళ్లాలని చూస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. గతంలో పెద్ద కంపెనీల్లో రొటీన్ పని బోర్ కొడుతుందంటూ అనేక మంది ఐటీ ఉద్యోగులు స్టార్టప్ కంపెనీల బాట పట్టారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ఉద్యోగులు లాంగ్ టర్మ్ అవకాశాలు, ఉద్యోగ భద్రతను దృష్టిలోకి తీసుకుని తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారని తెలుస్తోంది.

సంప్రదాయ కార్పొరేట్ యజమానులు గత దశాబ్ద కాలంగా పోటీతత్వాన్ని కొనసాగించేందుకు తమ ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాలను క్రమంగా పెంచుకుంటూ పోటీలో నిలదొక్కుకుంటున్నాయి. కానీ.. స్టార్టప్‌లు ప్రస్తుతం తల్లడిల్లిపోతున్నాయి. లాభాలను ఆర్జించలేక, వ్యాపార నిర్వహణకు అవసరమైన నగదును సేకరించలేకపోవటం.. ఇలా చాలా కారణాల వల్ల స్టార్టప్‌లు తిరోగమనం బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగిస్తున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా 71 టెక్ కంపెనీల నుంచి దాదాపు 17 వేల మందికి ఉద్వాసన పలికాయి.

భారత్ యునికార్న్స్‌తో సహా ఈ సంవత్సరం 18 భారతీయ స్టార్టప్‌లు 9,240 మంది ఉద్యోగులను తొలగించాయి. US ఆర్థిక వ్యవస్థ మే నెలలో 3,90,000 ఉద్యోగాలను జోడించింది. Citigroup Inc వంటి సాంప్రదాయ బ్యాంకులు కొత్త నియామకాలు ప్రకటించాయి. అయితే.. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ Coinbase Global Inc వంటివి నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ రోజుల్లో ఉద్యోగులు స్టాక్ ఆప్షన్ కంటే.. స్థిరమైన జీతం, ఇన్సూరెన్స్, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దేశంలోని దాదాపు 67% మంది విద్యార్థులు స్టార్టప్‌లకు బదులుగా పెద్ద కంపెనీలతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. దీనికి అవి అందింస్తున్న అధిక జీతాలు, ఉద్యోగ భద్రత కారణంగా తెలుస్తోంది.