AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: సమయం లేదు రైతన్నా.. ఇక ఐదు రోజులే గడువు.. ఆ మూడు పనులు చేయకపోతే డబ్బులు రావు..

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు రూ. 2000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అయితే మీరు దీనిని అందుకోడానికి ఈ కీలక అప్ డేట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా 2023, అక్టోబర్ 15లోపు మూడు పనులు లబ్ధిదారులు చేయాల్సి ఉంటుంది. ఆ మూడు పనులు ఏంటి? ఎలా పూర్తి చేయాలి? తెలుసుకుందాం రండి..

PM Kisan: సమయం లేదు రైతన్నా.. ఇక ఐదు రోజులే గడువు.. ఆ మూడు పనులు చేయకపోతే డబ్బులు రావు..
Pm Kisan Samman Nidhi Yojana
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 10, 2023 | 8:45 PM

Share

మీరు పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్(పీఎం-కిసాన్) లబ్ధిదారుగా ఉన్నారా? అయితే మీకో అలర్ట్! మీరు 15వ వాయిదా ప్రకారం నగదు స్వీకరించాలి అంటే ఓ కీలకమైన అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు రూ. 2000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అయితే మీరు దీనిని అందుకోడానికి ఈ కీలక అప్ డేట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా 2023, అక్టోబర్ 15లోపు మూడు పనులు లబ్ధిదారులు చేయాల్సి ఉంటుంది. వాటిని పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ లబ్ధదారులకు ఆ రెండు వేల రూపాయల సాయం వారి అకౌంట్ నకు క్రెడిట్ కాదు. ఆ మూడు పనులు ఏంటి? ఎలా పూర్తి చేయాలి? తెలుసుకుందాం రండి..

పీఎం కిసాన్ పథకం ఇది..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొన్ని మినహాయింపులకు లోబడి, సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలకు చేయుతను అందించడం ఈ పథకం లక్ష్యం. సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలలకు మూడు వాయిదాలలో ఒక్కొక్కటి రూ. 2000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధుల బదిలీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 27న ఆ మొత్తాన్ని బదిలీ చేయడం ద్వారా చాలా అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించారు. 14వ విడతగా సుమారు రూ. 18,000 కోట్లను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన 8.5 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు.

ఇవి కూడా చదవండి

15వ విడతకు ఇది తప్పనిసరి..

15వ విడత నగదు జమ చేయడానికి లబ్ధిదారులు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..

ఈ-కేవైసీ వెరిఫికేషన్.. ముందుగా మీరు ఈ-కేవేసీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోత పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు నగదు బదిలీ జరగదు. ల్యాండ్ డేటా సీడింగ్.. మీ భూమికి సంబంధించిన వివరాలను అధికారులకు అందించాలి.

ఆధార్- బ్యాంక్ అకౌంట్ లింక్.. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు పనులు ఇంకా మీరు పూర్తి చేయకపోతే అక్టోబర్ 15లోపు పూర్తి చేయాలి. లేకుండా పీఎం కిసాన్ నగదు మీకు జమకాదు. ఇంకా ఆరు రోజుల మాత్రమే గడువు..

ఈ పనులను పూర్తి చేయడానికి మీకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, మీరు ఈ పథకం ప్రయోజనాలను అందుకోరని గుర్తుంచుకోండి. ఈ నగదు నవంబర్ లో ఖాతాలో జమ చేయవచ్చు. ఈ నిధుల విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 15వ విడత పీఎం కిసాన్ నిధుల స్థితిని తనిఖీ చేయడానికి లేదా మరింత సమాచారం కోసం, మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..