AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan: ఫైనాన్షియల్ గిఫ్ట్స్ గురించి విన్నారా? రాఖీ పండుగ రోజు మీ చెల్లెలికి ఇవి గిఫ్ట్‌గా ఇస్తే.. మెస్మరైజ్ అయిపోతారు.. ట్రై చేయండి..

ఆ రోజు తప్పనిసరిగి చెల్లెలికి అన్నలు ఓ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు నగదు గిఫ్ట్ గా ఇస్తారు. లేదంటే ఏవైనా గ్యాడ్జెట్లు, నగలు, స్మార్ట్‌ఫోన్‌లు, సౌందర్య సాధనాలు, వస్త్రాలు వంటి వాటితో వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఏదైనా డిఫరెంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? నిజమే కదా.. ఆ క్షణం వారి సంతోషానికి మాత్రమే కాకుండా వారి జీవితానికి భద్రతనిచ్చేలా.. వారి భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఆర్థిక పరమైన బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బావుంది కదా?

Raksha Bandhan: ఫైనాన్షియల్ గిఫ్ట్స్ గురించి విన్నారా? రాఖీ పండుగ రోజు మీ చెల్లెలికి ఇవి గిఫ్ట్‌గా ఇస్తే.. మెస్మరైజ్ అయిపోతారు.. ట్రై చేయండి..
Raksha Bandhan
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 25, 2023 | 9:55 AM

Share

అన్న, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. రక్షా బంధన్ అని పిలుచుకునే ఈ పర్వదినానికి మన దేశంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆగస్టు 30న ఈ పండుగను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. సోదరీమణులు జీవితాంతం తమ రక్షణగా ఉండమని కోరుతూ సోదరులకు కట్టేది రాఖీ. వారి మధ్య ప్రేమకు, అనుబంధానికి కూడా ఇది సాదృశ్యంగా ఉంటుంది. ఆ రోజు ప్రతి ఇంట్లోనూ సందడి కనిపిస్తుంది. అన్నలకు రాఖీలు కట్టే చెల్లెళ్లు అన్న నుంచి మంచి గిఫ్ట్ ఆశించిడం పరిపాటి. ఆ రోజు తప్పనిసరిగి చెల్లెలికి అన్నలు ఓ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు నగదు గిఫ్ట్ గా ఇస్తారు. లేదంటే ఏవైనా గ్యాడ్జెట్లు, నగలు, స్మార్ట్‌ఫోన్‌లు, సౌందర్య సాధనాలు, వస్త్రాలు వంటి వాటితో వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఏదైనా డిఫరెంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? నిజమే కదా.. ఆ క్షణం వారి సంతోషానికి మాత్రమే కాకుండా వారి జీవితానికి భద్రతనిచ్చేలా.. వారి భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఆర్థిక పరమైన బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బావుంది కదా? అలాంటి బహుమతి కూడా ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? ఇదే విషయాన్ని నిపుణులను అడిగితే కొన్నిసలహాలు ఇచ్చారు. మీ సోదరీమణులకు ఆర్థికపరమైన వెసులబాటు కలిగేలా కొన్ని గిఫ్ట్ లు ఇవ్వవచ్చని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం రండి..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ).. మ్యూచువల్ ఫండ్లలో క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి ఎస్ఐపీలు సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తాయి. దీని ద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధించడం సులభతరం అవుతుంది. సోదరులు తమ సోదరీమణుల ఆకాంక్షలకు నెరవేర్చేందుకుఇది బహుమతిగా ఇవ్వవచ్చు. అంటే వారు ఏదైనా ఫారిన్ వెళ్లాలనుకున్నా.. వ్యాపార ప్రయత్నాలు, లేదా ఇతర ఆశయాలను చేరుకునేందుకు ఇది ఆర్థిక తోడ్పాటు నందిస్తుంది.

ఆరోగ్య బీమా పాలసీ.. మీ సహోదరి ఆరోగ్యానికి పూర్తి భద్రతనిస్తూ.. ఏదైనా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ చేయించడం చాలా మంచి ఆలోచన. అకస్మాత్తుగా వచ్చే రోగాల నుంచి ఆమెను రక్షించేందుకు ఆమెకు ప్రత్యేకమైన పాలసీని తీసుకొని ప్రీమియం మీరే చెల్లించవచ్చు.

ఇవి కూడా చదవండి

డిజిటల్ బంగారం.. భౌతిక బంగారాన్ని బహుమతిగా ఇవ్వడానికి బదులుగా, డిజిటల్ బంగారం మీ తోబుట్టువులకు బహుమతిగా ఇవ్వడానికి మరొక ఎంపిక.

గోల్డ్ ఈటీఎఫ్‌లు.. ఈటీఎఫ్‌లు లేదా గోల్డ్ సేవింగ్స్ ఖాతాల ద్వారా పేపర్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా మంచి ఆలోచనే.

రుణ సాధనాలు.. గ్రీన్ ఫిక్సెడ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) లేదా రికరింగ్ డిపాజిట్లను చేయడం కూడా మంచిది. ఈ ఆర్థిక బహుమతులు సోదరీమణుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా వారికి శక్తినిస్తాయి.

స్టాక్స్.. స్టాక్‌లను బహుమతిగా ఇవ్వడం కూడా మంచి ఆలోచన. మీరు దీర్ఘకాల పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల స్టాక్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు

రక్షా బంధన్ ను సంప్రదాయ బహుమతులకు పరిమితం చేయకుండా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీ సోదరీమణులను ప్రత్యేకమైన గుర్తుగా వీటిని ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్ఐపీల నుంచి వైద్య బీమా వరకు ఆర్థిక బహుమతులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, సోదరులు తమ సోదరీమణుల ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రతను పెంపొందించిన వారు అవుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..