AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్‌కు చంద్రయాన్-3 జోష్.. వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు తథ్యం!

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చంద్రుడిపైకి మనం పంపిన రాకెట్ చంద్రయాన్-3 అనేది ఇతర దేశాలతో పోల్చితే చాలా చవకైనది. సరిగ్గా దీనినే నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇదే వచ్చే దశాబ్దంలో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో మార్కెట్‌లో భారతీయ సహకారాన్ని 3 శాతం నుంచి10 శాతానికి పెంచబోతోందని వివరిస్తున్నారు. దాదాపు 13 లిస్టెడ్ భారతీయ కంపెనీలు స్పేస్ మార్కెట్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్‌కు చంద్రయాన్-3 జోష్.. వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు తథ్యం!
Stock Market
Madhu
|

Updated on: Aug 25, 2023 | 11:00 AM

Share

అందనంటూ ఊరిస్తున్న చందమామను అందుకున్న ఇస్రో కొత్త చరిత్ర స‌ృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన మొదటి దేశంగా నిలిచింది. మొత్తంమీద రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రుడిని అందుకున్న దేశంగా అవతరించింది. ఇది యావత్ దేశం గర్వించదగ్గ విషయం. అయితే ఇది కేవలం అంతరిక్ష ప్రయోగాలకు మాత్రమే ప్రయోజనం కాదు. చాలా రంగాలపై ఇది పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మన దేశానికి ఇది కొత్త ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని వివరిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చంద్రుడిపైకి మనం పంపిన రాకెట్ చంద్రయాన్-3 అనేది ఇతర దేశాలతో పోల్చితే చాలా చవకైనది. తక్కువ బడ్జెట్లోనే దీనిని మనవాళ్లు విజయవంతం చేశారు. సరిగ్గా దీనినే నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇదే వచ్చే దశాబ్దంలో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో మార్కెట్‌లో భారతీయ సహకారాన్ని 3 శాతం నుంచి10 శాతానికి పెంచబోతోందని వివరిస్తున్నారు. దాదాపు 13 లిస్టెడ్ భారతీయ కంపెనీలు స్పేస్ మార్కెట్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. ఆ కంపెనీలలో లార్సెన్ అండ్ టర్బో (ఎల్అండ్ టీ), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), లిండే ఇండియా , పారాస్ డిఫెన్స్ మొదలైనవి ఉంటాయని చెబబుతున్నారు. అలాగే రక్షణ రంగ స్టాక్‌లు కూడా లాభపడతాయని భారతీయ స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటే ఈ తరహా స్టాక్ లపై ఓ సారి దృష్టి పెట్టడం మంచిదని చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

భారత ఆర్థిక వ్యవస్థకు జోష్..

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం సహకారం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు 2-3% దోహదపడుతోంది. ఇది 8-10% పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే 8-10 సంవత్సరాలలో మన దేశం తక్కువ ఖర్చుతో కూడిన ఉపగ్రహ లాంచర్‌గా నిలబడుతుందని కచ్చితంగా చెబుతున్నారు. తద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాలు ఊపందుకుంటాయి. భారతదేశంలో దాదాపు 140 రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. బడ్జెట్ కేటాయింపులు కూడా మున్ముందు పెరుగుతాయి. కాబట్టి మొత్తంగా ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తనిస్తుంది.

భారతీయ స్టాక్ మార్కెట్‌కు లాభం..

ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సాధించిన ఈ మైలురాయి నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎలా డబ్బు సంపాదించగలరు అనే అంశంపైనా నిపుణులు మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం 3 ట్రిలియన్ డాలర్లు కలిగిన ఆర్థిక వ్యవస్థ. రానున్నకాలంలో 5 ట్రిలియన్‌ డాలర్లుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం భారీ అవకాశాలు ఉన్న మార్కెట్‌లను మనం ఉపయోగించుకోవాలి. మన దేశంలో రాకెట్ల ప్రయోగం చవకగా ఉంటుంది కాబట్టి రష్యా, యుఎస్ లేదా చైనా నుంచి రాకెట్లు ప్రయోగించాలనుకొనే ఇతర దేశాల వరకూ మన దేశం వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడి కొన్ని కంపెనీలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఆయా కంపెనీల స్టాక్ వాల్యూలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ స్టాక్స్ కు కొత్త ఊపు..

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన స్టాక్ లు దీర్ఘకాలంలో లాభపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మీరు ఈ రోజే స్టాక్స్ పెట్టుబడి పెట్టాలని భావిస్తే అది కూడా దీర్ఘకాలానికి మీకు ఎల్ అండ్ టీ, ఎల్ అండ్ టీ టెక్, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ , భారత్ ఫోర్జ్ , ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ , అవంటెల్ , లిండే ఇండియా, హెచ్ఏఎల్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ , బీఈఎల్, బీహెచ్ఈఎల్ వంటి స్టాక్‌లు మీకు మంచి ఆప్షన్ కాగలవని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆర్థికవేత్తల సలహాల మేరకు అందించడం జరుగుతుంది.  ఏమైనా సందేహాలు ఉంటే ఆర్థిక నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే