Long Term Investment: ఆ రంగాల్లో పెట్టుబడితో లాభాల పంట.. ధీర్ఘకాలిక పెట్టుబడితో రాబడికి హామీ
ప్రపంచంలో టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాలలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో మంచి రాబడినిచ్చే రంగాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రపంచంలో టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాలలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో మంచి రాబడినిచ్చే రంగాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏయే రంగాల్లో పెట్టుబడితో అధిక రాబడి ఆర్జించవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.
ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున ఈ రంగం అభివృద్ధికి పెట్టే పెట్టుబడి రాబోయే సంవత్సరాల్లో గణనీయమైన రాబడిని అందిస్తుంది. 2024 ప్రైవేట్ పెన్షన్ బేరోమీటర్ నివేదికలో క్యాపిటల్ గ్రూప్ విశ్లేషకులు పేర్కొన్న అనేక ప్రాంతాలలో ఏఐ ఒకటిగా. కొలంబియా థ్రెడ్‌నీడిల్, క్యాపిటల్ గ్రూప్‌ల సహకారంతో రూపొందించిన నివేదికలో కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రపంచ వాణిజ్య మార్పులు, వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఏఐ అన్ని రంగాల్లో విస్తరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తయారీ లేదా ఆరోగ్య సంరక్షణలో అయినా ఏఐ ప్రతిచోటా ప్రత్యేక ముద్రను వేస్తుందని వివరిస్తున్నారు. అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఏఐ పవర్డ్ రోబోట్‌లను తయారు చేస్తున్నాయి. ఇవి పనిని చాలా వేగంగా, సులభంగా చేస్తాయి. ఏఐ వల్ల ఉద్యోగాల్లోనూ పెద్ద సంక్షోభం ఏర్పడుతుందనేది వేరే విషయం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా ఎల్క్సీ వంటి భారతదేశంలో ఏఐపై పని చేస్తున్నాయి.
ఆరోగ్య సంరక్షణ సేవల రంగం కూడా వేగంగా మారుతోంది. ఒక కొత్త సాంకేతికత సెల్ థెరపీ, దీనిలో కణాలు శరీరం వెలుపల మారుస్తారు. ముఖ్యంగా వ్యాధిని నయం చేయడానికి సెల్ థెరపీ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సను సులభతరం చేసే జీన్ సైలెన్సింగ్ వంటి సాంకేతికతలపై పరిశోధనలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ దిశగా పెద్దఎత్తున పెట్టుబడి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుంది. కరోనా కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరా పెద్ద మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీలు చైనాకు దూరంగా ఇతర దేశాలలో వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా దేశాలు దీని వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఈ విషయంలో మెక్సికో ముందంజలో ఉంది.
ముఖ్యంగా మంచి మౌలిక సదుపాయాల కారణంగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. అలాగే వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీల సాయంతో రైతులు మరింత దిగుబడి సాధిస్తున్నారు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అనే సాంకేతికతలో పంటల ప్రతి అవసరాన్ని పొలాల్లో సెన్సార్‌లను అమర్చడం ద్వారా గుర్తించడం ద్వారా పంట దిగుబడిని 30 శాతం వరకు పెంచడానికి సహాయపడుతుంది. దీంతోపాటు కొత్తరకం విత్తనాలను అభివృద్ధి చేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. బేయర్ లాంటి కంపెనీలు ఈ రంగంలో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడితో పెట్టుబడిదారులు అధిక లాభాలను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..