Gold Loans: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాలను ధరించడం సమాజంలో గౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవి అలంకార వస్తువులుగా కాకుండానే మన ఆర్థిక అవసరాలను తీర్చుతాయి. ఎందుకుంటే బంగారు ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.

Gold Loans: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..
Gold Loans
Follow us

|

Updated on: Aug 20, 2024 | 4:16 PM

ప్రతి ఒక్కరూ తమ అవసరాలు, అనుకోకుండా వచ్చిన ఖర్చులు, వైద్య చికిత్సల కోసం తప్పనిసరిగా రుణాలు తీసుకుంటారు. వీటి కోసం సాధారణంగా బ్యాంకులను ఆశ్రయిస్తారు. బ్యాంకులలో వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రెడిట్ స్కోర్, మన ఆదాయం తదితర వివరాలను పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. అయితే బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ల ను చాలా సులభంగా పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులతో పాటు తక్కువ వడ్డీకే, తక్కువ సమయంలో రుణాలను అందిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకులు అందిస్తున్న గోల్డ్ లోన్లు, వాటి వడ్డీ రేట్లను తెలుసుకుందాం. 2024 ఆగస్టు నాటికి బంగారు రుణాలపై వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారంపై రుణాలు..

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాలను ధరించడం సమాజంలో గౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవి అలంకార వస్తువులుగా కాకుండానే మన ఆర్థిక అవసరాలను తీర్చుతాయి. ఎందుకుంటే బంగారు ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.

వడ్డీరేటు తక్కువ..

అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. వీటిపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముందుగా రుణం తీసుకోవాలనుకున్న బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. అక్కడ బ్యాంకు సిబ్బంది మీ బంగారాన్ని తూకం వేస్తారు. అలాగే కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ బంగారంపై మీకు లభించే రుణం, వడ్డీరేటు, తిరిగే చెల్లించే వాయిదాల గురించి మీకు తెలియజేస్తారు.

చాలా సులభం..

వ్యక్తి గత రుణాలతో పోల్చితే బంగారు రుణాలు చాలా సులభంగా మంజూరవుతాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ అసలు అవసరం లేదు. దాని గురించి ఆలోచించరు. అలాగే డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులువుగా జరుగుతుంది. కేవలం కేవైసీ పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. అలాగే మీ ఆదాయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉండదు.

గోల్డ్ లోన్ల పై వడ్డీ రేట్లు..

బంగారంపై దాదాపు అన్ని బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. అయితే వడ్డీరేట్ల, ప్రాసెసింగ్ ఫీజలు విషయంలో కొంచెం తేడాలు ఉంటాయి.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్ లో బంగారు రుణాలపై 8 నుంచి 24 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజుగా 2శాతం, జీఎస్ టీ విధిస్తున్నారు.
  • హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో 8.30 నుంచి 16.55 శాతం వడ్డీరేటు, మంజూరు చేసిన సొమ్ములో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వస్తూలు చేస్తున్నారు.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 నుంచి 8.55 శాతం వడ్డీ, లోన్ మొత్తంలొో 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • యూకో బ్యాంకులో 8.50 శాతం వడ్డీ, రూ.250 నుంచి రూ.5 వేలు వరకూ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
  • యూనియన్ బ్యాంకులో 8.65 నుంచి 9.90 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో 9.28 శాతం వడ్డీ, లోన్ మొత్తంలో 0.75 శాతంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
  • కెనరా బ్యాంకులో 9.60 శాతం వడ్డీ, రూ.500 నుంచి రూ.5 వేల వరకూ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • 8.ఐసీఐసీఐ బ్యాంకులో 10 శాతం వడ్డీ, లోన్ మొత్తంలో ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..