Credit Card Scam: క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా.. మూడు లక్షలు దోచేసిన కేటుగాళ్లు

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఖాతాదారులు మేలైన సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు ఖాతాదారులకు క్రెడిట్, డెబిట్ కార్డులను అందించడంతో లావాదేవీలు సులువుగా మారాయి. అయితే డెబిట్ కార్డు పొందడం సులభమైనా క్రెడిట్ కార్డును బ్యాంకులు ఖాతాదారుడి ఆదాయాని అనుగుణంగా మంజూరు చేస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డులు అందరికీ ఉండవు. సరిగ్గా ఈ పాయింట్‌నే బేస్ చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్నాయి. తాజాగా అలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది.

Credit Card Scam: క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా.. మూడు లక్షలు దోచేసిన కేటుగాళ్లు
Credit Card
Follow us

|

Updated on: Aug 20, 2024 | 4:30 PM

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఖాతాదారులు మేలైన సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు ఖాతాదారులకు క్రెడిట్, డెబిట్ కార్డులను అందించడంతో లావాదేవీలు సులువుగా మారాయి. అయితే డెబిట్ కార్డు పొందడం సులభమైనా క్రెడిట్ కార్డును బ్యాంకులు ఖాతాదారుడి ఆదాయాని అనుగుణంగా మంజూరు చేస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డులు అందరికీ ఉండవు. సరిగ్గా ఈ పాయింట్‌నే బేస్ చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రెడిట్ కార్డు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్నాయి. తాజాగా అలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎటువంటి రుసుము లేకుండా క్రెడిట్ కార్డ్‌ను అందిస్తామని కొందరు కేటుగాళ్లు మోసం చేశారని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు పేరుతో మోసగాళ్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను ఎలా మోసగించారో? ఓ సారి చూద్దాం.

ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమన్ రాజ్‌పుత్  తాను క్రెడిట్ కార్డు పేరుతో మోసపోయానని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ రౌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ. రూ. 2.96 లక్షలు తస్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు పై అడిషనల్ డీసీపీ అలోక్ కుమార్ శర్మ వివరాలు వెల్లడించారు. అమన్ రాజ్‌పుత్ అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌కి చెందినవాడినని, ఓ యాప్ డౌన్‌లోడ్ చేస్తే క్రెడిట్ కార్డు ఈజీగా యాక్సెప్ట్ అవుతుందని నమ్మించాడు. ఆ యాప్ ద్వారా బ్యాంక్ ఖాతాలు, క్రెడెబిట్ కార్డ్‌ల గురించి సమాచారాన్ని సేకరించి మొత్తం మూడు లావాదేవీల ద్వారా రూ.2.96 లక్షలు కొట్టే శారు. 

లోన్ యాప్ స్కామ్‌లో రూ.2 లక్షల స్వాహా

మరో ఘటనలో ఆన్‌లైన్‌లో రుణం ఇప్పిస్తానన్న నెపంతో సైబర్‌ మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షలు మోసం చేశారని పోలీసులు తెలిపారు. ప్రాపర్టీ లోన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న తన్మయ్ సోన్వానియే అనే సోషల్ మీడియా పోస్ట్‌లోని లింక్‌పై పొరపాటున క్లిక్ చేశారని అదనపు డీసీపీ అలోక్ కుమార్ శర్మ తెలిపారు. తర్వాత గుర్తుతెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చి, లోన్‌ ఇప్పిస్తానన్న నెపంతో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తానంటూ మోసం చేశాడు. మోసగాళ్లు అతనికి మొదట్లో చిన్నపాటి రుణాలు అందించారు. కానీ ఆ తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అతను చెల్లించకపోతే యాప్ ద్వారా సేకరించిన ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. చేసేదేం లేక బాధితుడు వాళ్లు అడిగిన సొమ్మును ముట్టజెప్పాడు అంటే రూ.లక్ష అప్పు చేసిన బాధితుడు రూ.3 లక్షలు చెల్లించాడు. రెండు కేసుల్లో ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు మోసగాళ్ల ఖాతాలను స్తంభింపజేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా..మూడు లక్షలు దోచేసిన వైనం
క్రెడిట్ కార్డు పేరుతో వ్యక్తి టోకరా..మూడు లక్షలు దోచేసిన వైనం
లైకుల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా.. వైరల్ అవుతున్న వీడియో..
లైకుల కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతారా.. వైరల్ అవుతున్న వీడియో..
మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..
మీసం తిప్పుతూ ఇంద్ర డైలాగ్ చెప్పిన మెగాస్టార్..
ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు..
ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు..
తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..
తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి..
అత్యవసర సమయాల్లో ఆర్థిక భరోసా.. పర్సనల్ లోన్స్‌పై బంపర్ ఆఫర్లు
అత్యవసర సమయాల్లో ఆర్థిక భరోసా.. పర్సనల్ లోన్స్‌పై బంపర్ ఆఫర్లు
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయం గుప్పిట్లో భక్తులు
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయం గుప్పిట్లో భక్తులు
నేను భారతదేశపు అత్యుత్తమ స్పిన్నర్‌ని.. స్వ్కాడ్‌లో ఎంపిక చేయండి
నేను భారతదేశపు అత్యుత్తమ స్పిన్నర్‌ని.. స్వ్కాడ్‌లో ఎంపిక చేయండి
రెస్టారెంట్ నిర్వాహకులకు జొమాటో షాక్.. ఆ చిత్రాలను తొలగిస్తాం
రెస్టారెంట్ నిర్వాహకులకు జొమాటో షాక్.. ఆ చిత్రాలను తొలగిస్తాం
ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..
ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..