Zomato: రెస్టారెంట్ నిర్వాహకులకు జొమాటో షాక్.. ఆ చిత్రాలను తొలగిస్తామని ప్రకటన
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్‌లో వివిధ రకాల యాప్స్ ప్రజాదరణను పొందాయి. ముఖ్యంగా పట్ణణ ప్రాంతాల్లో అయితే ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రజలు బాగా ఉపయోగిస్తారు. మనకు కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఇంటి వద్దకే తెప్పించుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది ఫుడ్ డెలివరీ యాప్స్‌ను ఇష్టపడుతున్నారు.
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్‌లో వివిధ రకాల యాప్స్ ప్రజాదరణను పొందాయి. ముఖ్యంగా పట్ణణ ప్రాంతాల్లో అయితే ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రజలు బాగా ఉపయోగిస్తారు. మనకు కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన రెస్టారెంట్ నుంచి ఇంటి వద్దకే తెప్పించుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది ఫుడ్ డెలివరీ యాప్స్‌ను ఇష్టపడుతున్నారు. అయితే డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ సమయంలో చూపించే ఫొటోలను చూసి ఆర్డర్ చేస్తే వచ్చాక ఆహారం దారుణంగా ఉంటుందని కొందరు యూజర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన చిత్రాలు కూడా జొమాటో యాప్స్‌లో రెస్టారెంట్ల నిర్వాహకులు యాడ్ చేస్తుండడంతో జొమాటో రెస్టారెంట్ నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటో ఓ సారి చూద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫుడ్, డిష్ చిత్రాలను జొమాటో ప్లాట్‌ఫారమ్ నుంచి కంపెనీ తొలగిస్తుందని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. వినియోగదారులను తప్పుదారి పట్టించే ఏఐ ద్వారా రూపొందించిన ఆహారం/డిష్ చిత్రాలపై కస్టమర్లు అనేక ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇలాంటి ఫొటోలను వాడడం అనేది కస్టమర్‌లు, రెస్టారెంట్‌ల మధ్య నమ్మకాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని వివరించారు. ముఖ్యంగా రీఫండ్‌లు రేట్ పెరగడమే కాకుండా కస్టమర్‌లు తక్కువ రేటింగ్ ఇస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కాబట్టి రెస్టారెంట్ మెనూల్లో డిష్ చిత్రాల కోసం ఏఐను ఉపయోగించకుండా ఉండాలని రెస్టారెంట్ భాగస్వాములను కోరుతున్నామని దీపిందర్ గోయల్ ప్రకటించారు.
జొమాటో యాప్‌లో కూడా ఈ నెలాఖరు నాటికి మెనుల నుంచి అటువంటి చిత్రాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రెస్టారెంట్ యజమానులు, అంతర్గత మార్కెటింగ్ బృందాలు మార్కెటింగ్ ప్రయోజనాల కోసం ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను ఉపయోగించడం మానేయాలని సూచించారు. భవిష్యత్‌లోకూడా ఏఐ ద్వారా రూపొందించిన వంట చిత్రాలను అంగీకరించమని స్పష్టం చేసింది. రెస్టారెంట్ యజమానులు మీరు మీ మెనూ కోసం నిజమైన ఫుడ్ షాట్‌లలో ఇంకా పెట్టుబడి పెట్టకపోతే దయచేసి catalogue@zomato.comలో ఫోటో షూట్ షెడ్యూల్ చేయడానికి మా కేటలాగ్ సపోర్ట్ టీమ్‌ని సంప్రదించాలని కోరింది. ఈ నిషేధం మా మార్కెటింగ్ బృందానికి కూడా వర్తిస్తుందని వివరించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..