AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Mutual Fund: ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే కనకవర్షమే.. పెట్టుబడిదారులూ ఓ లుక్కేయండి..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ అలోకేటర్ ఫండ్ కొంతకాలంగా స్థిరమైన మెరుగుదలను కనబరుస్తోంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునే వారికి చాలా మంచి ఎంపికగా మారింది. ఉదాహరణకు ఈ ఫండ్ లో 2003లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు ఆ డబ్బు రూ.11.13 లక్షలు అవుతుంది. దీని ద్వారా దాదాపు 12.39 శాతం వార్షిక రాబడి అందుతోంది.

ICICI Mutual Fund: ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే కనకవర్షమే.. పెట్టుబడిదారులూ ఓ లుక్కేయండి..
Investments
Madhu
|

Updated on: Aug 21, 2024 | 2:36 PM

Share

దీర్ఘకాలంలో అధిక రాబడి పొందటానికి సమర్థవంతమైన, నమ్మకమైన పెట్టుబడి మార్గాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బ్యాంకుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలలో డబ్బులను పెట్టుబడి పెడతారు. నిర్ణీత కాలానికి వడ్డీతో పాటు అసలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇటీవల మ్యూచువల్ ఫండ్స్ పై ప్రజలకు అవగాహన పెరిగింది. దీర్థకాలంలో అధిక రాబడి వచ్చే అవకాశం ఉండడమే దీనికి కారణం. అయితే వీటిలో పెట్టుబడి పెట్టే ముందు అనేక అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మెరుగైన రాబడి ఇస్తున్న ఫండ్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీ పెట్టుబడికి తగిన రాబడిని అందుకోగలుగుతారు. అలాంటి వాటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ అలోకేటర్ ఫండ్ ఒకటి. దీని ద్వారా మీరు ఎలా సంపదను పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

స్థిరమైన పెరుగుదల..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ అలోకేటర్ ఫండ్ కొంతకాలంగా స్థిరమైన మెరుగుదలను కనబరుస్తోంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునే వారికి చాలా మంచి ఎంపికగా మారింది. ఉదాహరణకు ఈ ఫండ్ లో 2003లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు ఆ డబ్బు రూ.11.13 లక్షలు అవుతుంది. దీని ద్వారా దాదాపు 12.39 శాతం వార్షిక రాబడి అందుతోంది. ఈ ఫండ్ గతేడాది కూడా లాభాలలో నడిచింది. రూ. 10 వేల పెట్టుబడిని రూ.14,819 చేసింది. ఐదేళ్లలో అదే మొత్తం రూ.19,971కి పెరుగుతుంది. అంటే మీ పెట్టుబడిని దాదాపు రెట్టింపు చేస్తుంది.

ఫండ్ కేటాయింపులు..

ఈ ఫండ్ ప్రధానంగా స్టాక్ మార్కెట్, బంగారం, ఆస్తిలో మీ డబ్బును పెట్టుబడి పెడుతుంది. ఈ మూడు మార్గాల ద్వారా మీ రాబడి గణనీయంగా పెరుగుతుంది. తద్వారా ధీర్ఘకాలంలో రాబడికి దోహదపడుతుంది. ఈ ఫండ్ తన పెట్టుబడులలో 35 నుంచి వంద శాతం వరకూ రుణ రహిత ఎంపికలకు కేటాయిస్తుంది. పెట్టుబడిదారులు లాభాలను పెంచుకుంటూ పన్నులపై ఆదా చేయడానికి వీలు కల్పిస్తుంది. 2024 బడ్జెట్లో ప్రవేశపెట్టిన మార్పుల కారణంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం ఫ్లాట్ రేటుతో పన్ను విధిస్తున్నారు. దీని నుంచి పెట్టుబడిదారులు కనీసం 24 నెలల పాటు ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి.

వడ్డీపై కూడా రాబడి..

మరో విషయం ఏమిటంటే కొనుగోలు చేసిన, మరొక పథకం నుంచి మారిన యూనిట్లను రీడీమ్ చేసినా, అలాట్‌మెంట్ చేసిన ఒక సంవత్సరంలోపు స్విచ్ చేసినా ఎటువంటి రుసుము లేకుండా 30 శాతం యూనిట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా చాలా ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. పెట్టుబడిదారులు అత్యవసర పరిస్థితుల్లో ఛార్జీలు లేకుండా తమ పెట్టుబడిలో కొంత భాగాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. ప్రధానంగా సమ్మేళనం వడ్డీ అనేది మునుపటి కాలాల నుంచి ప్రధాన, సేకరించిన వడ్డీ రెండింటిపై లెక్కిస్తారు. అంటే వడ్డీ అదనపు వడ్డీని సృష్టించడం మొదలు పెడుతుంది దీని వల్ల మీ పెట్టుబడి విపరీతంగా పెరిగే అవకాశం కలుగుతుంది.

ఎంపికే కీలకం..

మార్కెట్లో వివిధ రకాల పెట్టుబడి మార్గాలు, అవకాశాలు ఉంటాయి. వాటిలో మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ కు అనుగుణంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అదే మీ విజయానికి పునాది అని చెప్పవచ్చు. బలమైన రాబడిని అందించే ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్‌లను అన్వేషించడం చాలా కీలకం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..