AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Vida V1 Pro: బంపర్ ఆఫర్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 24,000 తగ్గింపు.. మరిన్ని అదనపు ప్రయోజనాలు..

ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్త ఉత్పత్తులు కంపెనీలు మార్కెట్లోకి లాంచ్ చేస్తూనే.. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఉన్న మోడళ్లపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో మోటో కార్ప్ తన ఎలక్ట్రిక్ వాహనం విడా వీ1 ప్రోపై అదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 24,000వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది.

Hero Vida V1 Pro: బంపర్ ఆఫర్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 24,000 తగ్గింపు.. మరిన్ని అదనపు ప్రయోజనాలు..
Hero Vida V1
Madhu
|

Updated on: Jan 25, 2024 | 8:38 AM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్త ఉత్పత్తులు కంపెనీలు మార్కెట్లోకి లాంచ్ చేస్తూనే.. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఉన్న మోడళ్లపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో మోటో కార్ప్ తన ఎలక్ట్రిక్ వాహనం విడా వీ1 ప్రోపై అదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 24,000వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హీరో వీడా వీ1 ప్రోపై ఆఫర్లు ఇవి..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై అనేక ప్రయోజనాలతో కూడిన ఆఫర్ ను హీరో కంపెనీ ప్రకటించింది. వాటిల్లో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000 కాగా రూ. 6,600 ఈఎంఐ బెనిఫిట్స్, ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీ రేటులో 50శాతం డిస్కౌంట్, రూ. 2,500 విలువైన ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 5000 లాయల్టీ బోనస్, ఇప్పటికే హీరో మోటో కార్ప్ వినియోగదారు అయితే రూ. 2,500 కార్పొరేట్ బోనస్ పొందొచ్చు. అదే విధంగా రూ. 1,125 విలువైన ఆరు నెలల సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్లన్నింటితో కలపి మీరు హీరో వీడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం రూ. 1.25లక్షలకే కొనుగోలు చేయొచ్చు.

ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇన్ స్టంట్ లోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హీరో ఫిన్ కార్ప్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఈకొఫీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకోవచ్చు. మీరు కేవలం రూ. 499 ఆన్ లైన్ చెల్లించడం ద్వారా ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. వెహికల్ లోన్ ని కేవలం 5.99శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు. అంతేకాక ఈ లోన్లు జీరో ప్రాసెసింగ్ ఫీజుకు పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

హీరో వీడా వీ1 ప్రో రేంజ్..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ కేవలం 65 నిమిషాల్లో 80శాతం చార్జ్ ఎక్కుతుంది. దీని యాక్సెలరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.2 సెకండ్లలోనే అందుకోగలగుతుంది.

హీరో వీడా వీ1 ప్రో ఫీచర్లు..

ఈ స్కూటర్లో రిమూవబుల్ పిల్లియన్ సీట్, రిమూవబుల్ బ్యాటరీ ఉంటాయి. టచ్ స్క్రీన్ డిస్ ప్లే, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 26లీటర్ల బూట్ స్పేస్, ఎమర్జెన్సీ అలర్ట్ స్విచ్, కీ ఫాబ్, పాలో మీ హోం లైట్స్, బ్లూటూత్, వైఫై, 4జీ, నావిగేషన్, జీయోఫెన్స్, రిమోట్ ఇమ్మోబిలైజేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి టాప్ ఫీచర్లు ఉంటాయి.

హీరో వీడా వీ1 ప్రో వారంటీ..

ఈ స్కూటర్ పై హీరో కంపెనీ ఐదేళ్లు/50,000 కిలోమీటర్ల వారంటీ, అలాగే బ్యాటరీపై మూడేళ్లు/30,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. దీనిలో మోటార్ ఐపీ68 సర్టిఫికేషన్ తో వస్తుంది. బ్యాటరీ ఐపీ 67 సర్టిఫైడ్. ఈ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆ కలర్లు వైట్, రెడ్, ఆరెంజ్, బ్లాక్, సియాన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..