Income Tax: పదేళ్లలో రెండింతలు.. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఎంతంటే..

కేంద్ర ఐటీ శాఖకు సంబంధించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఇటీవల ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కీలక గణాంకాలను ప్రకటించింది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలు చేసే వారి సంఖ్య 7.78కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 3.8కోట్లు మాత్రమే.

Income Tax: పదేళ్లలో రెండింతలు.. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఎంతంటే..
Income Tax
Follow us
Madhu

|

Updated on: Jan 25, 2024 | 8:15 AM

దేశంలో పన్ను చెల్లింపుదారులు పెరుగుతున్నారు. ఏడాదికేడాది వీరి ద్వారా వచ్చే ఆదాయం అధికమవుతోంది. గత పదేళ్ల కాలంలో ఈ సంఖ్యను గమనిస్తే దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 7.78 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. ఇది పదేళ్ల క్రితం దానితో పోల్చితే 104 రెట్లు అధికమని స్పష్టం చేసింది. అనుకున్న లక్ష్యాన్ని కూడా అధిగమించింది. దీనికి సంబంధించిన వివరాలు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఇటీవల ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎంత మంది? వారి చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సీబీడీటీ గణాంకాలు ఇవి..

కేంద్ర ఐటీ శాఖకు సంబంధించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఇటీవల ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కీలక గణాంకాలను ప్రకటించింది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలు చేసే వారి సంఖ్య 7.78కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 3.8కోట్లు మాత్రమే. అంటే పదేళ్ల కాలంలో ఏకంగా 104.91 శాతం పెరిగింది. 2013-14లో పన్నుల రూపంలో నికరంగా వసూలైన మొత్తం రూ. 6,38,596కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు మొత్తం రూ. 16,63,686కోట్లకు చేరిందని సీబీడీటీ చెప్పింది. దీని ప్రకారం నికర పన్నుల వసూళ్లలో ఏకంగా 160.52శాతం గ్రోత్‌ కనిపించిందని వివరించింది.

లక్ష్యాన్ని అధిగమించి..

అదే విధంగా ప్రత్యక్ష పన్నుల(వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్‌) రూపంలో రూ. 18.23లక్షలకోట్లు వసూలు చేయాలని గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో సమర్పించిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాలతో పోల్చితే ఇది 9.75శాతం ఎక్కువ. ఇదేక్రమంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లను పరిశీలిస్తే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 173.31శాతం పెరిగిందని సీబీడీటీ వివరించింది. అంటే రూ. 19,72,248 కోట్లకు చేరింది. 2013-14లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 7,21,604కోట్లుగా ఉంది. 2013-14 జీడీపీలో పన్ను శాతం 5.62శాతం ఉంటే ప్రస్తుతం అది 6.11శాతానికి పెరిగిందని సీబీడీటీ తన గణాంకాల్లో వివరించింది. 2013-14లో పన్ను వసూళ్ల కోసం చేసిన ఖర్చు 0.57శాతం ఉంటే.. అది మరింత తగ్గి 2022-23 నాటికి 0.51శాతానికి చేరింది. ఫలితంగా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..