AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSY: సుకన్యా సమృద్ధి యోజన ఖాతా ఎలా ప్రారంభించాలి? ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఉందా?

ఆడబిడ్డల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై). ఆడపిల్లల ఉన్నత విద్యావసరాలతో పాటు వివాహ విషయంలో ఆర్థిక భరోసా అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్న పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకంపై 8.2శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది.

SSY: సుకన్యా సమృద్ధి యోజన ఖాతా ఎలా ప్రారంభించాలి? ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఉందా?
Sukanya Samriddhi Yojana
Madhu
|

Updated on: Jan 25, 2024 | 7:04 AM

Share

ఆడబిడ్డల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై). ఆడపిల్లల ఉన్నత విద్యావసరాలతో పాటు వివాహ విషయంలో ఆర్థిక భరోసా అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్న పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకంపై 8.2శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. ఈ వడ్డీ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో వస్తున్న వడ్డీతో సమానం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో మీ పిల్లల పేరు మీద డబ్బు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఆడపిల్ల పేరుమీద ఖాతా ప్రారంభించిన తల్లిదండ్రులు ఏడాదికి రూ. 250 నుంచి రూ. 1.5లక్షల వరకూ డిపాజిట్‌ చేయొచ్చు. అలా వరుసగా 15ఏళ్ల పాటు నిరంతరం దీనిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆడపిల్ల పుట్టిన మొదటి తేదీ నుంచి వారికి పదేళ్లు వచ్చే లోపు ఎప్పుడైనా ఖాతాను ప్రారంభించొచ్చు. ఆ పిల్లకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ వస్తుంది. అయితే 18ఏళ్లు నిండిన తర్వాత సగం మొత్తం విత్‌ డ్రా చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఖాతాను ఎలా ప్రారంభించాలనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. ఆన్‌లైన్‌ ఖాతా ఓపెన్‌ చేయొచ్చా? ఆన్‌లైన్‌లో నగదు జమ చేయొచ్చా? వంటి సందేహాలు ఉ‍న్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆన్‌లైన్‌లో ఎస్‌ఎస్‌వై ఓపెన్‌ చేయొచ్చా?

సుకన్యా ఖాతాను పోస్ట్‌ ఆఫీసు లేదా బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. అయితే రెండింటిలోనూ ఆన్‌లైన్లో ఖాతా ప్రారంభించే అవకాశం లేదు. ఆఫ్‌ లైన్లోనే ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. బ్యాంకు లేదా పోస్ట్‌ ఆఫీసుకు వెళ్లి అవసరమైన ఫారంను పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫారం ఆన్‌లైన్లో లభ్యం అవుతుంది. దానిని పూరించి సమర్పించొచ్చు. అయితే ఒక్కసారి ఖాతా ప్రారంభించిన తర్వాత లావాదేవీలు, నగదు జమలు అన్నీ ఆన్‌లైన్లోనే చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు..

సుకన్య సమృద్ధి యోజన ఫారమ్‌ను పూరించిన తర్వాత దానితో పాటు కొన్ని పత్రాలను బ్యాంకు లేదా పోస్టాఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోగ్రాఫ్‌, సంరక్షకుల గుర్తింపు కార్డు వంటి పత్రాలు అసలు, నకలుతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీసుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు ఫారమ్‌ను తనిఖీ చేసి, అటాచ్ చేసిన డాక్యుమెంట్‌లను అసలైన వాటితో సరిపోల్చుతారు. ఆ తర్వాత ఖాతాను ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్లో ఇవి చేయొచ్చు..

ఒక్కసారి ఖాతా ప్రారంభించిన తర్వాత దానిని ఆన్‌లైన్లోనే ఆపరేట్‌ చేయొచ్చు. ఆన్‌లైన్లో ఏమేమి పనులు చేయచ్చంటే.. డబ్బు డిపాజిట్ చేయవచ్చు, తదుపరి వాయిదాలను చెల్లించవచ్చు, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు, స్టేట్‌మెంట్‌ను కూడా చూడవచ్చు. అలాగే మీ ఖాతాను మరొక శాఖకు బదిలీ చేయవచ్చు. ఖాతా మెచ్యూర్ అయినప్పుడు, మొత్తాన్ని ఆన్‌లైన్‌లో అమ్మాయి ఖాతాకు బదిలీ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..