AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర మదిలో కొత్త ఐడియా.. LPG చౌకగా లభించే అవకాశం? ఎలాగంటే?

ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే లక్ష్యంతో ఎల్‌పిజిలో డైమిథైల్ ఈథర్ మిశ్రణకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ దిశగా BIS ప్రమాణాలు విడుదల చేసింది. అయితే భద్రత, నిల్వ, సరఫరా అంశాలపై మరింత సాంకేతిక పరిశోధన అవసరమని ఇంధన నిపుణులు సూచిస్తున్నారు.

కేంద్ర మదిలో కొత్త ఐడియా.. LPG చౌకగా లభించే అవకాశం? ఎలాగంటే?
Lpg
SN Pasha
|

Updated on: May 23, 2026 | 8:02 PM

Share

దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దిగుమతి ఖర్చులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఎల్‌పిజి (LPG)లో డైమిథైల్ ఈథర్ (DME) అనే కృత్రిమ ఇంధనాన్ని మిళితం చేసే ప్రణాళికను త్వరలో రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఎల్‌పిజి–డైమిథైల్ ఈథర్ మిశ్రణకు సంబంధించిన ప్రమాణాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో వినియోగిస్తున్న ఎల్‌పిజి కూడా ముడి చమురు నుంచే ఉత్పత్తి అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం లేదా సరఫరా అంతరాయాలు ఏర్పడినప్పుడు, దేశీయంగా ఎల్‌పిజి, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో డైమిథైల్ ఈథర్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎల్‌పిజితో కలిపి వినియోగిస్తే దిగుమతులపై ఆధారపడటం కొంత మేర తగ్గవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఎల్‌పిజిలో 10 నుంచి 20 శాతం వరకు డైమిథైల్ ఈథర్ మిశ్రమాన్ని వినియోగించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా కేంద్రం ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ విధానం అమలులోకి వస్తే ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా సరఫరా వ్యవస్థ మరింత స్థిరంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఇంధన రంగ నిపుణులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. డైమిథైల్ ఈథర్ ఇంకా ప్రారంభ దశలో ఉన్న సాంకేతికత కావడంతో దీని భద్రత, నిల్వ, రవాణా, వినియోగ విధానాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా ఎల్‌పిజితో కలిపినప్పుడు గ్యాస్ సిలిండర్లు, పంపిణీ వ్యవస్థ, వినియోగ పరికరాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలన్నింటిని పరిశీలించిన తర్వాతే అమలు దిశగా ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us