Direct Tax: ట్యాక్స్ వసూళ్లలో రికార్డ్.. ప్రభుత్వానికి ప్రతి నిమిషానికి ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో తెలుసా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 80 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఖజానాకు ప్రత్యక్ష పన్నుల ద్వారా చాలా డబ్బు వచ్చింది. ఈ కాలంలో ప్రభుత్వం నిమిషానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత సంపాదించిందో వింటే మీరు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 80 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఖజానాకు ప్రత్యక్ష పన్నుల ద్వారా చాలా డబ్బు వచ్చింది. ఈ కాలంలో ప్రభుత్వం నిమిషానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత సంపాదించిందో వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి నిమిషానికి రూ.3.38 కోట్ల ప్రత్యక్ష పన్నులు వచ్చాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 11 శాతం ఎక్కువ.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.3.8 లక్షల కోట్లు వసూలు చేసింది. జూన్ 17 వరకు ఈ ఆదాయం వచ్చినట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం 78 రోజుల్లో ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఆ లెక్కన చూస్తే నిమిషానికి 3.38 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి చేరినట్లు తెలుస్తోంది.
ముందస్తు పన్ను వసూళ్ల గురించి చెప్పాలంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ 17 వరకు ప్రభుత్వ ఖజానాలోకి లక్షా 16వేల 776 లక్షల కోట్ల రూపాయలు చేరాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 13.70 శాతం ఎక్కువ వసూలు అయ్యాయి. జూన్ 17 నాటికి నికర ప్రత్యక్ష వసూళ్లు రూ.3 లక్షల 79 వేల 760 కోట్లు, ఇందులో రూ.1 లక్ష 56 వేల 949 కోట్లు కార్పొరేట్ పన్ను (CIT) అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.2 లక్షల 22 వేల 196 కోట్లు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి