Agriculture : ఈ 5 వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో మంచి లాభాలు..! పెట్టుబడి కూడా తక్కువే..
Agriculture : భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజు కూడా దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 50 శాతానికి పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో
Agriculture : భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజు కూడా దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 50 శాతానికి పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ప్రధాన జీవనాధారం. అందువల్ల ఈ రంగంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం అనేది పంటల పెంపకం మాత్రమే కాదు అందులో పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య సంపద మొదలైనవి కూడా ఉంటాయి. ఈ 5 వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా మీరు మంచి లాభాలు పొందవచ్చు.
1. సేంద్రియ ఎరువుల ఉత్పత్తి ఈ రోజుల్లో ప్రజలు మొక్కల ఆరోగ్యం గురించి చాలా అవగాహన కలిగి ఉన్నారు. రసాయన ఎరువులు మొక్కలకు ఎంత హానికరమో తెలుసుకున్నారు. అందుకే సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నారు. అందుకే సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి ఇప్పుడు మంచి వ్యాపారంగా చెప్పవచ్చు. దీనికి చాలా డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ప్రారంభించవచ్చు. మీరు వంటగది వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయవచ్చు.
2. పుట్టగొడుగుల పెంపకం ఈ రోజుల్లో పుట్టగొడుగుల పెంపకానికి భారీ డిమాండ్ ఉంది. మంచి విషయం ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. అంతేకాదు స్థలం కూడా పెద్దగా అవసరం లేదు. ఈ బిజినెస్ కోసం మీరు ఏదైనా పుట్టగొడుగుల వ్యవసాయ కేంద్రం లేదా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రాథమిక శిక్షణ తీసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుఎస్, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్ పుట్టగొడుగులను అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో పుట్టగొడుగులను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత త్రిపుర, కేరళ.
3. ఔషధ మొక్కల సాగు.. ప్రస్తుత కరోనా వల్ల ప్రజలు ఆయుర్వేదం ప్రాముఖ్యతను గ్రహించారు. ఔషధ మూలికలు అనేక వ్యాధులను నయం చేయడంలో ఎలా సహాయపడతాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దీంతో ఔషధ మొక్కల పెంపకంపై రైతులు దృష్టి సారించారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు కొన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసి లైసెన్స్ పొందాలని గుర్తుంచుకోండి.
4. పాడి వ్యవసాయం ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలన్నీ కల్తీమయం అవుతున్నప్పుడు మీరు ఆవు, గేదె స్వచ్ఛమైన పాలను విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. కేవలం 3-4 పశువులతో పాడి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు క్రమంగా ఈ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఇది కాకుండా మీరు ఆవు పేడ నుంచి ఎరువును తయారు చేయవచ్చు.
5. వెదురు సాగు వెదురు సాగు కోసం మీకు కనీసం 1-2 ఎకరాల భూమి అవసరం. అయితే వెదురును సులభంగా పెంచవచ్చు. వాస్తవానికి దీనిని పొడి ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతారు. అభివృద్ధి చెందుతున్న మొక్కలలో ఒకటిగా ఉన్న వెదురు సాగు మీకు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అందిస్తుంది. మీరు వెదురును టోకు వ్యాపారులు, భూ యజమానులు, వెదురు ఫర్నిచర్ ఫ్యాక్టరీలు మొదలైన వాటికి విక్రయించవచ్చు.