EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! ఈ-నామినేషన్ దాఖలు చేశారా..? లేదంటే చాలా నష్టం..

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల భవిష్యత్‌ కోసం నియమించిన సంస్థ. జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని PF రూపంలో ఈ సంస్థకు కేటాయిస్తారు. ఇది పెట్టుబడిగా,

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! ఈ-నామినేషన్ దాఖలు చేశారా..? లేదంటే చాలా నష్టం..
Epfo
Follow us
uppula Raju

|

Updated on: Aug 10, 2021 | 9:03 AM

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల భవిష్యత్‌ కోసం నియమించిన సంస్థ. జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని PF రూపంలో ఈ సంస్థకు కేటాయిస్తారు. ఇది పెట్టుబడిగా, ఉద్యోగులకు పొదుపుగా భావిస్తారు. EPFO సభ్యులు ఈ-నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కలిగి ఉంటారు. ఇది ఫైల్‌ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి EPFO ​ఆన్‌లైన్ సేవను ప్రారంభించింది.

EPFO సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి ఇకపై పేపర్ ఫారమ్‌లను పూరించాల్సిన అవసరం లేదు. EPFO సభ్యులు (https://www.epfindia.gov.in/site_en/index.php) EPF పోర్టల్ సందర్శించడం ద్వారా వారి నామినేషన్లను దాఖలు చేయవచ్చు.ఈ-నామినేషన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సభ్యుడి మరణం మీద PF, పెన్షన్ (EPS), బీమా (EDLI) ప్రయోజనాలను సులభంగా పొందడంలో సహాయపడుతుంది. ఇది నామినీకి ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది. దీని సహాయంతో మీరు మీ నామినీకి సంబంధించిన సమాచారాన్ని EPFO కార్యాలయంలో సమర్పించవచ్చు.

ఆన్‌లైన్ నామినేషన్ ఎలా చేయాలి 1. దీని కోసం మీరు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పై క్లిక్ చేయడం ద్వారా మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి. 2. మీరు నామినేట్ చేయకపోతే పాప్ ద్వారా హెచ్చరికను చూస్తారు. 3. మీరు మేనేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంపికను ఎంచుకోవాలి 4. ఇప్పుడు కొత్త వెబ్‌పేజీలో మీ కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నలు అడుగుతారు. 5. మీరు అవును, కాదు అని సమాధానం ఇవ్వాలి. 6. మీరు అవును అని ఎంచుకుంటే మీరు నామినీని చేయాలనుకుంటున్న కుటుంబ సభ్యుల గురించి వివరాలను అందించాలి. 7. మీరు నామినీతో ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధాన్ని అందించాలి. చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాల సమాచారం ఇవ్వాలి. 8. తర్వాత మీ కుటుంబ వివరాలను సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. 9. మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత మీరు EPF నామినేషన్‌ను సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి.

EPFO సమాచారం ఇచ్చింది ఈ-నామినేషన్ దాఖలు చేయడం గురించి EPFO ​ట్వీట్ చేయడం ద్వారా తెలియజేసింది. ట్వీట్ చదవండి- ప్రావిడెంట్ ఫండ్ (PF), పెన్షన్ (EPS), భీమా (EDLI) ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పొందడానికి మీ ఈ-నామినేషన్‌ను ఈరోజు ఫైల్ చేయండి.

Whatsapp: మీ వాట్సాప్‌ దానందట అదే లాగవుట్‌ అవుతోందా..? అయితే టెన్షన్‌ పడాల్సిన పనిలేదంటోన్న టెక్‌ దిగ్గజం.

EX-Servicemen : మాజీ సైనికులకు, అధికారులకు పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు..! ప్రతి సంవత్సరం ఎంత కేటాయిస్తారు..?

YS Sharmila: ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్