YS Sharmila: ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో షర్మిల దీక్ష.. పోటీపై కీలక ప్రకటనకు ఛాన్స్..
Nirudyoga Nirahara Deeksha: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేపడుతున్న YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు. గతవారం...
ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేపడుతున్న YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు. ఈ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టనున్నారు. YSR తెలంగాణ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల. గతవారం తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రాక షబ్బీర్ అనే యువకుడు ట్రైన్ కింద పడి హాత్మహత్య చేసుకున్నాడు. ముందుగా షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ షర్మిల.. అనంతరం దీక్షకు దిగనున్నారు. అయితే ప్రతి మంగళవారం షర్మిల దీక్ష చేయడం సాధారణమే అయినా.. ఆమె ఈసారి చేయబోయే దీక్ష హుజూరాబాద్ నియోజకవర్గంలో కావడంతో ఆసక్తి నెలకొంది.
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అటు ఈటల రాజేందర్‌తోపాటు అధికార TRS హుజూరాబాద్‌లో గెలుపుపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ కూడా ఇదే త్వరలోనే హుజూరాబాద్ కేంద్రంగా వివిధ రకాల కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్న YS షర్మిల ఏం చేయనున్నారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని గతంలోనే షర్మిల ప్రకటించారు. అసలు హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా.. అంటూ ఓ సందర్భంలో షర్మిల ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే అని కామెంట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని అనూహ్యమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే అది TRSను కొంతమేర టెన్షన్ పెట్టొవచ్చనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి : Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి
Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా