Congress leader kapil sibal: కపిల్ సిబల్ బర్త్ డే సెలబ్రేషన్స్..డిన్నర్ లో అంతా పాలిటిక్స్..కాంగ్రెస్ నాయకత్వంపై ఫైర్
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తన బర్త్ డే సందర్భంగా నిన్న రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన డిన్నర్ పూర్తిగా రాజకీయ రంగును సంతరించుకుంది. ప్రతిపక్ష నాయకులంతా హాజరైన ఈ 'టాక్ ఆఫ్ ది డిన్నర్' గాంధీ కుటుంబ నాయకత్వంపైనే ఫోకస్ పెట్టింది.
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తన బర్త్ డే సందర్భంగా నిన్న రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన డిన్నర్ పూర్తిగా రాజకీయ రంగును సంతరించుకుంది. ప్రతిపక్ష నాయకులంతా హాజరైన ఈ ‘టాక్ ఆఫ్ ది డిన్నర్’ గాంధీ కుటుంబ నాయకత్వంపైనే ఫోకస్ పెట్టింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నది అజెండాయే అయినా.. మొదట కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాలని చాలామంది నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబ లీడర్ షిప్ నుంచి బయట పడేంతవరకు పార్టీ బలోపేతం కాదని కొంతమంది స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిన్నర్ మీటింగ్ లో పి.చిదంబరం, శశిథరూర్, ఆనంద్ శర్మతో బాటు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ ఓబ్రీన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, అకాలీదళ్ తరఫున నరేష్ గుజ్రాల్, బిజూ జనతా దళ్ నుంచి పినాక్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ తరుణంలో క్లియర్ ఫోకస్ తో విపక్షాలంతా సమైక్యం కావలసి ఉందని కపిల్ సిబల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నరేష్ గుజ్రాల్ అయితే కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చితేనే పార్టీ బలోపేతమవుతుందన్నారు. లేని పక్షంలో ఇలాగే ఎన్నికల్లో ఓటమి చవి చూస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. ఇక కేంద్రంలో బీజేపీని గద్దె దింపాలంటే.. రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీతో మనం చేతులు కలపాలని చిదంబరం సూచించారు. ప్రాంతీయ పార్టలను చిన్న చూపు చూడరాదన్నారు. బిజూ జనతా దళ్ నేత పినాక్ మిశ్రా కూడా ఆయనతో ఏకీభవించారు. లోగడ కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త మార్పు రావాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది ‘అసమ్మతి నేతల్లో” చాలామంది పరోక్షంగా మళ్ళీ ఈ డిమాండ్ లేవనెత్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch :నిన్నటి వరకు ఓ లెక్క. ఇవ్వాల్టి నుంచి మరో లెక్క. ఆడొచ్చాడని చెప్పు..!మరిన్ని వార్తా కధనాల కొరకు న్యూస్ వాచ్…( వీడియో ).
ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్.. ఎలాగంటే..! :Airtel offer Video.