మయన్మార్ నుంచి ఇండియాకు 8 వేలమందికి పైగా శరణార్థులు..తిప్పి పంపేస్తున్నాం..పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడి
మయన్మార్ లో సైనిక కుట్ర జరిగినప్పటి నుంచి 8 వేలమందికి పైగా ఆ దేశస్థులు, శరణార్థులు ఇండియాకు చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో అయిదున్నర వేలమందిని ఆ దేశానికి తిప్పి పంపివేశామని, ఇంకా రెండున్నర వేలమంది ఇప్పటికీ ఇండియాలో
మయన్మార్ లో సైనిక కుట్ర జరిగినప్పటి నుంచి 8 వేలమందికి పైగా ఆ దేశస్థులు, శరణార్థులు ఇండియాకు చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో అయిదున్నర వేలమందిని ఆ దేశానికి తిప్పి పంపివేశామని, ఇంకా రెండున్నర వేలమంది ఇప్పటికీ ఇండియాలో ఉన్నారని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పార్లమెంటుకు తెలిపారు. అనేక మంది ఇండో-మయన్మార్ బోర్డర్ పోస్ట్ లోని మిజోరాం వంటి రాష్ట్రాల్లో తలదాచుకున్నారని ఆయన వెల్లడించారు. ఇండియాకు మయన్మార్ శరణార్ధుల రాక గురించి ప్రభుత్వం ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. మయన్మార్ శరణార్థులకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించాలని మిజోరాం సీఎం జొరాంతాంగా కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే వీరికి ఎంతకాలం ఆశ్రయం కల్పిస్తామని కేంద్రం ప్రశ్నించింది. 1951 నాటి యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ (ఒప్పందం) లో ఇండియా భాగస్వామి కాదని అజయ్ భట్ గుర్తు చేశారు. ఈ శరణార్ధుల విషయమై సర్కార్ మన చట్టాల దృష్టిలోనే కాకుండా మానవీయ కోణంలో కూడా చూడాలని విదేశాంగ మంత్రి త్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి ఇటీవల పేర్కొన్నారు.
మయన్మార్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని ప్రభుత్వం కోరుతోందని, ఇదే సమయంలో సున్నితమైన ఈ సమస్యపై దృష్టి సార్ సారించవలసి ఉందని ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో వస్తున్న వీరి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందన్నారు. తమ దేశంలో పోలీసు అధికారుల, సైనికాధికారుల ఆదేశాలను పాటించలేక మయన్మార్ నుంచి చాలా పోలీసు కుటుంబాలు రహస్యంగా సరిహద్దులు దాటి మిజోరాం రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా ఇక్కడ శరణార్థులుగా ఉండగోరుతున్నారు. కొంతమంది తమకు భారతీయ పౌరసత్వం కల్పించాలని కూడా అభ్యర్థిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch :నిన్నటి వరకు ఓ లెక్క. ఇవ్వాల్టి నుంచి మరో లెక్క. ఆడొచ్చాడని చెప్పు..!మరిన్ని వార్తా కధనాల కొరకు న్యూస్ వాచ్…( వీడియో ).
ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్.. ఎలాగంటే..! :Airtel offer Video.