Canada – India: భారత్ విమానాలపై ఆంక్షల కొనసాగింపు.. నిషేధాన్ని పొడిగిస్తూ ప్రకటన చేసిన కెనడా.
Canada - India: కరోనా కారణంగా దేశాల మధ్య దూరం పెరిగి పోయింది. ఒక దేశానికి చెందిన విమానాలు మరో దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన..
Canada – India: కరోనా కారణంగా దేశాల మధ్య దూరం పెరిగి పోయింది. ఒక దేశానికి చెందిన విమానాలు మరో దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన విమానాలను తమ దేశంలోకి రాకుండా కెనడా గతంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధం గడువు ఆగస్టు 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కెనెడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ విమానాలపై నిషేధాన్ని సెప్టెంబర్ 21 వరకు పొడగిస్తున్నామని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
డెల్టా వేరింట్ విజృంభన నేపథ్యంలో గత ఏప్రిల్ 22 నుంచి భారత్ నుంచి నేరుగా వెళ్లే విమానలపై కెనడా ఆంక్షలు విధించింది. అయితే సాధారణ ప్రయాణికులతో వెళ్లే విమానాలను నిషేధించినప్పటికీ.. కార్గో, మెడికల్ వస్తువుల రవాణా, మిలటరీ విమానాలకు మినహాయింపును ఇచ్చింది. కెనడా ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మళ్లీ పరిస్థితులు అనుకూలించగానే ప్రత్యక్ష విమానాలను అనుమిస్తున్నామని కెనడా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే కెనడా భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై ఆంక్షలు విధించినప్పటికీ.. ఇతర దేశాల మీదుగా కెనడా వచ్చే వారిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని.. ప్రయాణానికి ముందు తప్పనిసరిగా భారత్ నుంచి కాకుండా మూడో దేశం నుంచి చెల్లుబాటయ్యే కొవిడ్-19 ప్రీ డిపార్చర్ పరీక్ష చేయించుకున్న వారిపై ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
Also Read: Andhra Pradesh: ‘RCC’ ఆన్ లైన్ యాప్‌తో 10 కోట్ల రూపాయల స్కామ్..
Andhra Pradesh: దారుణాతి దారుణం.. చెత్త కుప్పల్లో తల్లిని వదిలివెళ్లిన కుటుంబ సభ్యులు..
Viral Video: రోడ్డు మధ్యలో డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన పోలీసులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..