Andhra Pradesh: దారుణాతి దారుణం.. చెత్త కుప్పల్లో తల్లిని వదిలివెళ్లిన కుటుంబ సభ్యులు..
Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. మనషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుందనడానికి
Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. మనషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుందనడానికి నిరద్శనమైన ఘటన వెలుగు చూసింది. ఇప్పటి వరుకు పసికందులను చెత్త కుప్పల్లో వదిలి వెళ్లిన ఉదంతాలు చూశాం. చెత్త కుప్పల్లో.. మురికి కాల్వల్లో.. అభం శుభం తెలియని పసివాళ్ళను వదిలి వెళ్లిన తల్లులను చూశాం. కానీ, ఇప్పుడు అంతకు మించిన ఘోరం వెలుగుచూసింది. కని, పెంచి పెద్ద చేసి.. వారి బతులకు ఒక దారి చూపించిన ముదుసలి తల్లిని చెత్త కుప్పలపాలు చేశారు మానవత్వం నశించిన కుటుంబ సభ్యులు. కారణమేంటో గానీ.. మాతృమూర్తిని రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్‌లో నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయారు ఆమె కుటుంబ సభ్యులు. వయోధికభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూనే.. చెత్త కుప్పల్లో నుంచి అతి కష్టం మీద రోడ్డు మీదకు వచ్చింది ఆ వృద్ధురాలు.
అయితే, రాత్రి సమయంలో షేర్ మహమ్మద్ పేటలో చిల్లకల్లు ఎస్సై దుర్గాప్రసాద్ గస్తీ తిరుగుతుండగా.. దయనీయ పరిస్థితిలో వృద్దురాలు కనిపించింది. ఆమెను చూసి ఎస్సై దుర్గా ప్రసాద్ చలించిపోయారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్సై దుర్గాప్రసాద్.. తన వాహనంలో ఆమెను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించారు. అయితే, తమది సూర్యాపేట అని, కుటుంబ సభ్యులు తనను ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలి వెళ్లారని కన్నీరు మున్నీరవుతూ చెప్పింది. వివరాలు తెలుసుకున్న ఎస్సై దుర్గా ప్రసాద్.. వృద్దురాలి కుటుంబ సభ్యులను పీఎస్‌కి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తానని తెలిపారు. ఏదేమైనా.. కన్నతల్లి అనే విజ్ఞత మరచి.. జంతువు కూడా ప్రవర్తించని విధంగా చెత్త కుప్పలో ఆమెను వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..