AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News : సిగరెట్ కాల్చడం కంటే ఈ 5 అలవాట్లు చాలా డేంజర్..! మార్చుకోపోతే తప్పదు భారీ మూల్యం..

Health News : ఆధునిక జీవితంలో ఖచ్చితంగా అనుసరించాల్సిన కొన్ని అలవాట్లు, పద్దతులు ఉన్నాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో రోగనిరోధక వ్యవస్థ క్షీణించి చాలామంది అనారోగ్యంతో

Health News : సిగరెట్ కాల్చడం కంటే ఈ 5 అలవాట్లు చాలా డేంజర్..! మార్చుకోపోతే తప్పదు భారీ మూల్యం..
Health News
uppula Raju
|

Updated on: Aug 10, 2021 | 9:17 AM

Share

Health News : ఆధునిక జీవితంలో ఖచ్చితంగా అనుసరించాల్సిన కొన్ని అలవాట్లు, పద్దతులు ఉన్నాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో రోగనిరోధక వ్యవస్థ క్షీణించి చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు సిగరెట్ కాల్చడం కంటే ఈ 5 అలవాట్లు చాలా డేంజర్. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

1. తగినంత నిద్ర లేదు మీరు సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అనారోగ్యంగా ఉంటారు. నాణ్యమైన నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ఇది ఒకటి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ కనీసం 6 గంటల పాటు నిద్రపోవాలి. లేదంటే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2. జంతు-ప్రోటీన్ ఆహారం తినడం జున్ను, మాంసం వంటి జంతు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని తినడం ధూమపానంతో సమానం. అటువంటి ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం నివారించడానికి బీన్స్ వంటి మొక్కల ప్రోటీన్లను మీ ఆహారంలో చేర్చుకోండి.

3. ఎక్కువసేపు కూర్చొనే సమయం మీరు ఆఫీసుకు వెళ్లి రోజంతా కుర్చీ నుంచి లేవకుండా పనిచేస్తే అది ధూమపానం కంటే ఎక్కువ డేంజర్. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దప్రేగు వంటి వివిధ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీర్ఘకాలం డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదమే. ప్రతి రెండు గంటలకు ఒకసారి నడవండి ఆపై మీ పనిని కొనసాగించండి.

4. ఒంటరిగా ఉండకండి.. మీరు ఏకాంతంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల జబ్బు పడే అవకాశాలు ఉన్నాయి. COVID-19 మన జీవితాల్లోకి ప్రవేశించి సాధారణ జీవిత నిర్వచనాన్ని మార్చివేసింది. భౌతిక దూరం సిఫార్సు చేయడంతో చాలామంది ఒంటరిగా ఉండాల్సివచ్చింది. కానీ ఒంటరిగా ఉండటం సరైంది కాదు. అవసరానికి తగ్గట్లు నడుచుకోవడం మంచిది. అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది.

5. ఒక వ్యక్తి బీపీ, షుగర్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మంచి వాతావరణంలో ఉండాలి. మీ మాట వినే కొంతమంది స్నేహితులను సంపాదించుకోవాలి. ప్రతి విషయానికి ఆందోళన చెందవద్దు. లేదంటే వీటితో పాటు మరికొన్ని కొత్త రోగాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

6. నిత్యం ఇంట్లో ఉండటం మంచిది కాదు.. విటమిన్ డి అనేది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌. ఇంట్లో 24/7 కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే విటమిన్-డి లోపం సంభవించవచ్చు.

7. పరిశోధన, అనేక అధ్యయనాల ఆధారంగా మాత్రమే ఈ సమాచారం అందించామని గుర్తించండి.

వైరల్‌గా మారిన పెళ్లికూతురు డ్యాన్స్‌ వీడియో..తండ్రి మామతో కలిసి నవవధువు చిందులు..షాక్ లో వరుడు..:Wedding Viral Video.

Allu Arha: తొలి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన అల్లు అర్హ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడ్కోలు పార్టీ ఫొటోలు..

Covid Vaccine Video: వ్యాక్సిన్ తీసుకోకుంటే మరో మప్పు?రెండోసారి కరోనా వస్తే శరీరంలో జరిగే మార్పులు ఇలా …