Fruit Combinations : ఈ 5 పండ్ల కాంబినేషన్ చాలా డేంజర్..! ఎప్పుడు కలిపి తినకండి..? అవేంటంటే..
Fruit Combinations : పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు ఏ రోగికైనా ముందుగా పండ్లు తినమని సలహా ఇస్తారు. రోజుకో పండు తింటే అసలు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదు. పండ్లలో
Fruit Combinations : పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు ఏ రోగికైనా ముందుగా పండ్లు తినమని సలహా ఇస్తారు. రోజుకో పండు తింటే అసలు డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం కూడా ఉండదు. పండ్లలో ఖనిజాలు, విటమిన్లు విరివిగా ఉంటాయి. అయితే కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇవి విషంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి అలాంటి కాంబినేషన్ ఏంటో తెలుసుకుందాం.
1. బొప్పాయి, నిమ్మ – వైద్యులు బొప్పాయి, నిమ్మకాయలను అత్యంత ఘోరమైన కలయికగా భావిస్తారు. ఈ రెండు కలిపి తేంటే రక్తంలో హిమోగ్లోబిన్‌కు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదే సమయంలో ఈ కలయిక రక్తహీనతకు దారి తీస్తుంది.
2. ఆరెంజ్, క్యారెట్ – అదేవిధంగా ఆరెంజ్, క్యారెట్‌ను కలిపి తినడం మానుకోవాలి. ఇది శరీరంలో మూత్రపిండ సంబంధిత సమస్యలను ప్రేరేపిస్తుంది. నారింజ, క్యారెట్ కలయిక గుండెల్లో మంట, పిత్తానికి సంబంధించిన సమస్యలకు కారణమని చెబుతారు.
3. జామ, అరటిపండు – మీరు జామ, అరటిపండును కలిపి తినడం చాలా డేంజరని గుర్తించండి. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల పొట్టలో గ్యాస్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కడుపుతో పాటు తలనొప్పిని పెంచడానికి కూడా కారణమవుతుంది.
4. దానిమ్మ, నేరేడు పండు – దానిమ్మ, నేరేడు పండు రెండూ అధిక చక్కెర, ప్రోటీన్ అధికంగా ఉండే పండ్లు. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వాటిలో ఉండే అధిక చక్కెర ప్రోటీన్లను జీర్ణం చేసే శరీరంలోని ఎంజైమ్‌లను చంపేస్తుంది.
5. అరటిపండు, పాయసం- అరటిపండుతో పాయసం కలపడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం పొట్టలో భారమైన భావన కలుగుతుంది. అందువల్ల ఈ పండ్ల కలయికను పిల్లలకు ఇవ్వకూడదు.