Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Foods for Mental Health: ఇవి తింటే మూడ్ పెరుగుతుంది.. చిరాకును తెప్పించేవి కూడా ఉన్నాయి.. అవేంటో తెలుసా?

మనం తినే ఆహారం.. మన మనస్సుతోపాటు మెదడును కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే బాల్యం నుంచి సమతుల, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినమని చెబుతుంటారు. మీ మానసిక స్థితిని మెరుగుపరిచే ఆహారాలు, అలాగే చిరాకును పెంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Best Foods for Mental Health: ఇవి తింటే మూడ్ పెరుగుతుంది.. చిరాకును తెప్పించేవి కూడా ఉన్నాయి.. అవేంటో తెలుసా?
Best Foods For Mental Health
Follow us
Venkata Chari

|

Updated on: Aug 10, 2021 | 12:18 PM

మనం తినే ఆహారం.. మన మనస్సుతోపాటు మెదడును కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మన పొట్ట, మెదడుకు మధ్య లక్షలాది నరాలు, న్యూరాన్లు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. మనం తినే ఆహారం కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, రసాయనాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు.. నేరుగా మన మెదడును ప్రభావితం చేస్తాయి. అందుకే బాల్యం నుంచి సమతుల, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినమని చెబుతుంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తిన్నప్పుడు మనలో బద్ధకం ఆవహిస్తుంది. దీంతో ఏ పనిని సరిగా చేయలేం. అందుకే శరీరం, మనస్సు రెండూ ఫిట్‌గా ఉండేలా సమతుల ఆహారాన్ని తీసుకోమని నిపుణలు సూచిస్తుంటారు. మరి ఎలాంటి ఆహారాలు తీసుకంటే మన మానసిక స్థితిని మెరుగుపడుతుందో.. అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే చిరాకు పెరుగుతుందో తెలుసుకుందాం..

మానసిక స్థితిని పెంచే ఆహారాలు 1. అరటిపండు తిన్నప్పుడు, మన మెదడు మరింత శక్తిని గ్రహిస్తుంది. దీనికి కారణం అరటిపండ్లలో విటమిన్ బి6, అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ ఉన్నాయి. ఈ రెండూ శరీరంలో డోపామైన్, సెరోటోనిన్ వంటి మంచి హార్మోన్లను స్రవించడంలో సహాయపడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే మరింత శక్తి మనకు లభించినట్లు అనిపిస్తుంది.

2. వాల్ నట్స్, బాదం, వేరుశెనగ, గుమ్మడి మొదలైన గింజలు ట్రిప్టోఫాన్ కలిగి ఉంటాయి. ఇది మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగు మానసిక స్థితిని పెంపొందించడంలోనూ సహాయపడుతుంది.

3. బీన్స్, పప్పులు కూడా మన మూడ్‌ను పెంచే ఆహార పదార్థాలలో ఉంటాయి. వీటిని తినడం ద్వారా శరీరంలో డోపామైన్, సెరోటోనిన్, నోర్-ఎపినెఫ్రిన్ స్థాయిలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన మానసిక స్థితి పెంచేందుకు కీలకంగా పనిచేస్తాయి.

4. పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా లెక్కిస్తారు. ఎందుకంటే ఇందులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్‌గా పిలిచే కార్టిసాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం ద్వారా మనలో మానసిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి, పసుపును క్రమం తప్పకుండా తీసుకోవాలి.

5. బీట్‌రూట్, టమోటాలు కూడా సెరోటోనిన్ పెంచే ఆహారాలుగా పరిగణిస్తారు. వాటిని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఈ ఆహారాలు తీసుకుంటే చిరాకే.. 1. మీరు సోడా ఉప్పు లేదా అధిక చక్కెర పదార్థాలను మీ ఆహారంలో చేరుస్తున్నారా. అయిలే వెంటనే వాటిని తగ్గించండి. ఇవి నేరుగా మన రక్తంలో కలిసిపోతాయి. మొదట మీ శక్తిని వేగంగా పెంచినా.. అకస్మాత్తుగా తగ్గిస్తూ వస్తాయి. అలాగే ఇవి మన మనస్సును ప్రభావితం చేస్తుంది. దీంతో అలసట, ఉద్రిక్తత, చిరాకు ఎక్కువగా అనిపిస్తుంది.

2. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు నిస్సందేహంగా మనలో చిరాకును పెంచుతాయంట. బయటి ఆహారాన్ని తినడంతో క్రమంగా మనలో మంచి ఆహారాన్ని తినాలనే కోరికలను అణచివేస్తాయి. దీంతో మన మనస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటిని తినడం వల్ల కోపం, చిరాకు కూడా పెరుగుతుంది.

3. అలసట సమయంలో తక్షణ శక్తిని ఇవ్వడానికి కాఫీ పనిచేస్తుంది. కానీ, ఆందోళన, ఒత్తిడికిని కాఫీ పెంచుతుంది. కాఫీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వ్యక్తి స్వభావం చిరాకుగా మారుతుంది.

4. కాలీఫ్లవర్, క్యాబేజీ తినడం ద్వారా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది మనస్సును ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు మీకు తలనొప్పి, మానసిక స్థితిపై ఒత్తిడి పెరుగుతుంది.

Also Read: Fruit Combinations : ఈ 5 పండ్ల కాంబినేషన్ చాలా డేంజర్..! ఎప్పుడు కలిపి తినకండి..? అవేంటంటే..

Health News : సిగరెట్ కాల్చడం కంటే ఈ 5 అలవాట్లు చాలా డేంజర్..! మార్చుకోపోతే తప్పదు భారీ మూల్యం..