AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో రాబోయే బడ్జెట్‌లో ఏయే కొత్త పథకాలతో పాటు ఏవైనా తగ్గింపులను ప్రకటిస్తారేమోనని అందరూ ఎదురుచూస్తున్నారు. రాబోయే బడ్జెట్ 2024లో తక్కువ-ఆదాయ వ్యక్తులకు గణనీయమైన పన్ను తగ్గింపులను ప్రభుత్వం పరిశీలిస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Budget 2024: మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం
Budget 2024
Nikhil
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 24, 2024 | 6:06 PM

Share

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారం పార్లమెంట్ హాల్లో ఘనంగా జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 2024 సంవత్సారానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో రాబోయే బడ్జెట్‌లో ఏయే కొత్త పథకాలతో పాటు ఏవైనా తగ్గింపులను ప్రకటిస్తారేమోనని అందరూ ఎదురుచూస్తున్నారు. రాబోయే బడ్జెట్ 2024లో తక్కువ-ఆదాయ వ్యక్తులకు గణనీయమైన పన్ను తగ్గింపులను ప్రభుత్వం పరిశీలిస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే గడిచిన ఏడేళ్లలో ఆదాయపు పన్ను ఉపశమానానికి సంబంధించి కేంద్రం తీసుకునే మొదటి నిర్ణయం అవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ 2024లో సాధారణ పౌరులకు ఎలాంటి తగ్గింపులను అందిస్తారో? ఓ సారి తెలుసుకుందాం. 

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు అత్యధికంగా ఖర్చు చేసే వినియోగదారులకు పన్నులను తగ్గించే ప్రతిపాదనలను అన్వేషిస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రస్తుతం 5 శాతం నుంచి 20 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. అందువల్ల సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య సంపాదిస్తున్న వేతన పన్ను చెల్లింపుదారులు ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఈ తాజా బడ్జెట్‌లో కొత్త పన్ను స్లాబ్‌ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అదనంగా కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. పాత ఆదాయపు పన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లను స్ట్రీమ్‌లైన్ చేసే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ నిర్ణయాలు జరిగిపోయేయని పీఎంఓ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో 5.1 శాతం ద్రవ్య లోటు లక్ష్యాన్ని కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 50,000 కోట్ల చర్యల్లో దాదాపు సగం పన్ను తగ్గింపుల నుంచి వస్తాయి. అలాగే చిన్న రైతులకు పీఎం కిసాన్ నగదు చెల్లింపును రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచుతుందని అంచనా వేస్తున్నార. కనీస ఉపాధి హామీ కార్యక్రమం కింద చెల్లింపులు పెంచడం, మహిళా రైతులకు ఆర్థిక సహాయాన్ని విస్తృతం చేయడం వంటి అంశాలు చర్చల్లో ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు, పరిశ్రమల ఛాంబర్‌లతో సహా వాటాదారులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి బడ్జెట్‌ను జూలై 22న ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి