Ola EV Scooters: ఓలా ఈవీ స్కూటర్లపై అదిరే ఆఫర్‌ ప్రకటన.. ఏకంగా 15 వేల వరకూ తగ్గింపు

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం తారాస్థాయికి చేరింది. దీంతో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేశాయి. కాబట్టి అన్ని కంపెనీలు మార్కెట్‌లో పెరిగిన పోటీను తట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ ఎస్‌ 1  ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 వరకు విలువైన ఆఫర్లను ప్రకటించింది.

Ola EV Scooters: ఓలా ఈవీ స్కూటర్లపై అదిరే ఆఫర్‌ ప్రకటన.. ఏకంగా 15 వేల వరకూ తగ్గింపు
Ola Electric Scooters
Follow us
Srinu

|

Updated on: Jun 24, 2024 | 8:00 AM

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం తారాస్థాయికి చేరింది. దీంతో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేశాయి. కాబట్టి అన్ని కంపెనీలు మార్కెట్‌లో పెరిగిన పోటీను తట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓలా కంపెనీ ఎస్‌ 1  ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 వరకు విలువైన ఆఫర్లను ప్రకటించింది. ‘ఓలా ఎలక్ట్రిక్ రష్ ‘ ప్రచారంలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ బోనస్లు అందిస్తుంది. అయితే ప్రత్యేక ఆఫర్లు జూన్ 26, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఓలా ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ఫిక్స్‌ అయితే ఈ రెండు రోజుల్లో కొనుక్కోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో ఓలా ఎస్‌ 1 స్కూటర్లపై ఆఫర్లను ఓ సారి తెలుసుకుందాం. 

ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఆఫర్లు

ఈ స్కూటర్‌పై 5,000 ఫ్లాట్ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై పై 5,000 వరకు క్యాష్ బ్యాక్‌ను  అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసినప్పటికీ, 35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ముఖ్యంగా ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రుణాల పై 75,000 వరకు క్యాష్ బ్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్‌ ధర 89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో ఆఫర్లు

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో మోడల్‌ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.2,999 విలువైన ఓలా కేర్ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ప్యాకేజీలో భాగంగా వార్షిక సమగ్ర నిర్ధారణ, సర్వీస్ పికప్ డ్రాప్, వినియోగ వస్తువులు, దొంగతనం, రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో సహా ఉచిత సేవలను కూడా కస్టమర్లు పొందవచ్చు. అలాగే ఓలా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌ 1 ప్రో స్కూటర్లపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై 75,000 వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ ధర రూ.1.05 లక్షలు కాగా, ఎస్‌ 1 ప్రో ధర రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

ఇవి కూడా చదవండి

ఓలా ఎలక్ట్రిక్ 49 శాతం మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉంది. అలాగే కంపెనీ తన మోడల్ శ్రేణికి నవీకరణలను తీసుకువస్తోంది. ఎస్‌ 1 అనేది రూ.74,999 నుండి రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఈ స్కూటర్‌లో 2 కేడబ్ల్యూహెచ్‌, 3 కేడబ్ల్యూహెచ్‌, 4కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ ఎస్‌1 ఎక్స్‌పై ఎలాంటి ఆఫర్లు లేవు. ఓలా ఎలక్ట్రిక్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) జారీ చేసే ప్రక్రియలో ఉంది. కంపెనీ ఇటీవల తన డీహెచ్‌ఆర్‌పీను సెబీకు సమర్పించింది. కాబట్టి ఓలా రాబోయే నెలల్లో ఐపీఓ ప్రకటించే అవకాశం ఉంది. ఈ-స్కూటర్లతో పాటు కంపెనీ 2025 ద్వితీయార్థంలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఓలా గత ఏడాది ఆగస్టులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కాన్సెప్ట్స్‌ను ప్రదర్శించింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!