ACT FiberNet: మరో ఏడు నగరాల్లో యాక్ట్ ఫైబర్ సేవలు.. లాంచ్ ఆఫర్‌లో ఆ ఓటీటీకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
ఇటీవల కాలంలో ఫైబర్ నెట్ సేవలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఫైబర్ నెట్‌వర్క్‌ల గురించి సగటు వినియోగదారుడు సెర్చ్ చేస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌లో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కోసం చూస్తున్న వారికి యాక్ట్ ఫైబర్ నెట్ అనువుగా ఉంటుంది. కస్టమర్ అవసరాలకు అనుగునంగా యాక్ట్ కంపెనీ విస్తృత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది.
ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినయోగం బాగా పెరిగింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఉద్యోగుల ఇంటికి ఫైబర్ నెట్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు వాడడం పరిపాటి. ఆ ఫోన్లకు వైఫై ద్వారా నెట్ వర్క్‌ను ఆశ్వాదించవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫైబర్ నెట్ సేవలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఫైబర్ నెట్‌వర్క్‌ల గురించి సగటు వినియోగదారుడు సెర్చ్ చేస్తున్నాడు. తక్కువ బడ్జెట్‌లో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కోసం చూస్తున్న వారికి యాక్ట్ ఫైబర్ నెట్ అనువుగా ఉంటుంది. కస్టమర్ అవసరాలకు అనుగునంగా యాక్ట్ కంపెనీ విస్తృత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. కేవలం రూ.799కే సూపర్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇటీవల యాక్ట్ కంపెనీ తన సేవలను మరో ఏడు నగరాలకు విస్తరించింది, ఇప్పుడు మొత్తం 30 నగరాల్లో అందుబాటులో ఉంది. యాక్ట్ ఫైబర్ నెట్ నయా ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
యాక్ట్ ఫైబర్ నెట్ నెలకు రూ.799 ధరతో అత్యంత పొదుపుగా ఉండే ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 150 ఎంబీపీఎస్ వేగవంతమైన ఇంటర్నెట్ వేగంతో పాటు అపరిమిత డేటాను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు ఉచిత రూటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. మీకు సరసమైన ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. యాక్ట్ ఫైబర్ నెట్ భారతదేశంలోని మరో ఏడు నగరాలకు తన సేవలను విస్తరించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ ఇప్పుడు కాంచీపురం, ఘజియాబాద్, పొల్లాచ్చి, మచిలీపట్నం, ఒంగోలు, భీమవరం, తాడేపల్లిగూడెం నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ విస్తరణతో యాక్ట్ ఫైబర్‌నెట్ సేవలు ఇప్పుడు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, జైపూర్, లక్నో, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, పూణే, తిరుచ్చి, హోసూరు, విజయవాడ, వైజాగ్‌లతో సహా భారతదేశంలోని 30 నగరాలకు చేరుకున్నాయి.
నివేదికల ప్రకారం యాక్ట్ ఈ నగరాల్లో రూ.649 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లను అందిస్తుంది. కాంచీపురం, మచిలీపట్నం, ఒంగోలు, భీమవరం, తాడేపల్లిగూడెంలోని వినియోగదారులు రూ.649 ప్లాన్‌తో 40 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని పొందవచ్చు. అదే సమయంలో ఘజియాబాద్ కస్టమర్‌లు 50 ఎంబీపీఎస్ వేగంతో నెట్ పొందచవచ్చు. అలాగే పొల్లాచి వినియోగదారులు అదే ప్లాన్‌తో 75 ఎంబీఎస్ వేగంతో నెట్‌ను ఆశ్వాదించవచ్చు. మీరు కంపెనీ నుంmr కనెక్షన్ పొందాలనుకుంటే యాక్ట్ ఫైబర్ నెట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు లేదా సేవల గురించి సమాచారాన్ని పొందడానికి, కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవడానికి కస్టమర్ కేర్ నంబర్ 1800-1022-836కి కాల్ చేయాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి