AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: బడ్జెట్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం? నిర్మలమ్మ ఏమంటారో మరీ..

జూలైలోనే కేంద్రం నూతన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె ప్రసంగిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని, పౌరుల జీవన నాణ్యతను హైలైట్ చేశారు. ఇప్పుడు పూర్తి కేంద్ర బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర మంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Budget 2024: బడ్జెట్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం? నిర్మలమ్మ ఏమంటారో మరీ..
Budget 2024
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 24, 2024 | 5:40 PM

Share

ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టడం.. ఆర్థిక మంత్రిగా మళ్లీ నిర్మాలా సీతారామన్ పగ్గాలు తీసుకోవడంతో త్వరలో ప్రవేశపెట్టునున్న పూర్తి స్థాయి బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ వర్గాలు, పలు రంగాల ప్రముఖులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కొత్త నిర్ణయాలు, పాత ప్రోత్సాహాల కొనసాగింపు వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ ఉన్నారు. జూలైలోనే కేంద్రం నూతన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె ప్రసంగిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని, పౌరుల జీవన నాణ్యతలో మొత్తం మెరుగుదలను హైలైట్ చేశారు. ఇప్పుడు పూర్తి కేంద్ర బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర మంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కల్పనకు..

దేశ జీడీపీలో 3.4% ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక సంవత్సరం2024-25 కోసం మధ్యంతర బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. వాటిల్లో కొన్ని రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వాటిల్లో కింద పేర్కొన్న కొన్ని ప్రధానమైనవి.

రైల్వే కారిడార్లు.. పీఎం గతి శక్తి పథకం కింద మూడు ప్రధాన రైల్వే కారిడార్ కార్యక్రమాలు గుర్తించారు. ఈ కార్యక్రమాలు లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిర్దిష్ట కారిడార్‌లలో ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు, రైల్వే అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. అలాగే రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే క్రమంలో నలభై వేల సాధారణ రైలు బోగీలను వందేభారత్ ప్రమాణంగా మార్చనున్నారు. ఈ అప్‌గ్రేడ్ రైలు ప్రయాణంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.

విమానయాన విస్తరణ.. దేశంలోని విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగి 149కి చేరుకుంది. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, విమానయాన రంగాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ విస్తరణ జరిగింది. అదనంగా, ఐదు వందల పదిహేడు కొత్త మార్గాలను ప్రారంభించారు. వీటి సాయంతో 1.3 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. భారతీయ క్యారియర్లు కూడా 1,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఇది విమానయాన పరిశ్రమలో గణనీయమైన వృద్ధి దశను సూచిస్తుంది.

ఆర్థిక దృక్పథం.. సీతారామన్ తన ప్రసంగంలో, భారత ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాల మొత్తం సానుకూల ప్రభావాన్ని నొక్కి చెప్పారు . ఉజ్వల భవిష్యత్తు కోసం ఆకాంక్షిస్తూ ప్రజలు మెరుగ్గా జీవిస్తున్నారని, ఎక్కువ సంపాదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సగటు వాస్తవ ఆదాయం యాభై శాతం పెరిగిందని, ద్రవ్యోల్బణం మితంగానే ఉందని వివరించారు. కాగా ఇప్పుడు ఆ కార్యక్రమాలు, భారీ ప్రాజెక్టులు మరింత సమర్ధవంతంగా, సమయానుకూలంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తి స్థాయి బడ్జెట్లో అందిస్తారని అందరూ ఆశిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..