- Telugu News Photo Gallery Business photos Mukesh Ambani Jio Prepaid Cheapest Plan No Daily Limit Unlimited 5g Data Benefits
Jio Plan: జియో నుంచి చౌవకైన రీఛార్జ్ ప్లాన్.. హైస్పీడ్ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్..
Updated on: Jun 24, 2024 | 2:51 PM

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది.

ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్‌ఎంఎస్ వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

జియో ఈ ప్లాన్ ధర 296 రూపాయలు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో రోజువారీ పరిమితి ఇవ్వలేదు. ఎలాంటి అంతరాయం లేకుండా మీరు డేటాను ఉపయోగించుకోవచ్చు.

వినియోగదారులకు 30 రోజుల్లో 25 జీబీ డేటా అందిస్తుంది జియో. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తోంది.

ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లులు అందుతాయి. దీనితో పాటు, JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్ కూడా అందించబడుతుంది. ఇది వినియోగదారులకు అపరిమిత 5G డేటాను అందిస్తుంది.




