FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై అదిరే వడ్డీ ఆఫర్
భారతదేశంలో బ్యాంకులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ప్రత్యేక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మలా సీతారామన్ సూచనల మేరకు బ్యాంకులు కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
భారతదేశంలో బ్యాంకులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ప్రత్యేక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మలా సీతారామన్ సూచనల మేరకు బ్యాంకులు కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ప్రముఖ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సవరించిన రేట్లు సెప్టెంబర్ 7, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎంత మేర వడ్డీ రేట్లను పెంచిందో? ఓ సారి తెలుసుకుందాం.
ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇప్పుడు 3.50 శాతం నుంచి 7.00 శాతం మధ్య వడ్డీని అందిస్తుంది. ఏడు రోజుల నుంచి 61 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచారు. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రస్తుతం 1 సంవత్సరం 4 నెలల నుంచి 1 సంవత్సరం 6 నెలల లోపు వ్యవధిపై గరిష్టంగా 7.99 శాతం రాబడిని అందిస్తోంది. 7 నుండి 30 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 31 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్ 121 రోజుల నుంచి 180 రోజుల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 5 శాతం, 46 రోజుల నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన వాటిపై 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 181 రోజుల నుంచి 210 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.85 శాతం కాగా, 211 రోజుల నుంచి 269 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.10 శాతంగా ఉంది.
270 రోజుల నుంచి 354 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.35 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. 355 రోజుల నుంచి 364 రోజుల వరకు 6.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. ఒక సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 నెలలు వరకు చేసిన డిపాజిట్లపై 7.75 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుంది. ఒక సంవత్సరం 4 నెలల నుంచి 1 సంవత్సరం 6 నెలల లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ వడ్డీ రేటును 7.75 శాతం నుంచి 7.99 శాతానికి పెంచింది. 1 సంవత్సరం 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై వడ్డీ రేటును 7.75 శాతాన్ని మార్చకుండా ఉంచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2 సంవత్సరాల నుండి 61 నెలల కంటే తక్కువ కాలానికి మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతానికి వడ్డీ రేటు కొనసాగుతుంది. అలాగే 61 నెలల నుంచి అంతకంటే ఎక్కువ కాలవ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించారు. ఇండస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్‌లో అయితే మాత్రం సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.75శాతం రేటును అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..