TVS Apache RR310: బైక్ లవర్స్‌కు క్రేజీ అప్ డేట్.. సరికొత్త అపాచీ లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
కొత్త ఆర్ఆర్310లో డిజైన్ తో పాటు స్టైలింగ్, కొన్ని అత్యాధునిక ఫీచర్లు జోడించినట్లు చెబుతున్నారు. అన్ని కుదిరితే ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 అప్ గ్రేడెడ్ మోడల్ 2024 సెప్టెంబర్ 16న మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ కొత్త మోడల్లో కొత్తగా వస్తున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టీవీఎస్ నుంచి మన మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్ లలో స్పోర్టీ లుక్లో ఉండే అపాచీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అపాచీ ఆర్టీఆర్ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతోంది. అదే సమయంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310కి కూడా మంచి డిమాండే ఉంది. 2018లో మార్కెట్లోకి వచ్చిన ఈ బస్ 400సీసీ బైక్ స్పోర్ట్స్ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకుటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ కు మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా కేటీఎం ఆర్సీ 390 సవాలు విసురుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. అందుకోసం అపాచీ ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైక్ కి పలు అప్ గ్రేడ్లు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆర్ఆర్310లో డిజైన్ తో పాటు స్టైలింగ్, కొన్ని అత్యాధునిక ఫీచర్లు జోడించినట్లు చెబుతున్నారు. అన్ని కుదిరితే ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 అప్ గ్రేడెడ్ మోడల్ 2024 సెప్టెంబర్ 16న మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ కొత్త మోడల్లో కొత్తగా వస్తున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అపాచీ ఆర్ఆర్310లో కొత్తగా ఏముందంటే..
ప్రస్తుత పరీక్షల దశలో ఉన్న ఈ కొత్త అపాచీ స్పోర్ట్స్ బైక్ లో అనేక అప్ గ్రేడ్లు ఉన్నాయని చెబుతున్నారు. డిజైన్ పరంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సైడ్ ఫెయిరింగ్లపై ఏరోడైనమిక్ వింగ్లిట్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది సాధారణంగా అధిక- పనితీరు గల మోటార్ సైకిళ్లలో కనిపించే డిజైన్. అదనంగా, కొత్త కలర్ స్కీమ్స్, గ్రాఫిక్స్ పరిచయం చేయబడే అవకాశం ఉంది. అలాగే అపాచీ ఆర్టీఆర్ 310లో ఇప్పటికే ఉన్న బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఆర్ఆర్ 310 మోడల్లో కూడా ఉంటాయని అంచనా. హీటెడ్ లేదా కూల్డ్ సీటును చేర్చడం వల్ల రైడర్ సౌలభ్యం, సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
మెకానికల్ అప్ డేట్లు ఇవే..
మెకానికల్స్ పరంగా, ఇంజిన్ కు చిన్నపాటి సర్దుబాట్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుత 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ 33.5బీహెచ్పీ, 27.3ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని కాస్త అప్ గ్రేడ్ చేస్తూ.. 35.08బీహెచ్పీ అవుట్ పుట్ ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అప్ గ్రేడెడ్ అపాచీ ఆర్ఆర్310 లాచింగ్ సెప్టెంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ రాబోయే అప్డేడేట్ 2018లో మోడల్ను ప్రారంభించినప్పటి నుండి దాని పరిణామం కొనసాగింపును సూచిస్తుంది. వింగ్లిట్లు, సంభావ్య పనితీరు మెరుగుదలల జోడిస్తూ.. సెగ్మెంట్లో బలమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..