Ola Scooter: విసుగు తెప్పిస్తున్న ఓలా స్కూటర్లు.. ఓ కస్టమర్ ఏం చేశారంటే..
ఇటీవల కాలంలో చాలా నెగిటివ్ కామెంట్లు ఓలా స్కూటర్ల వినియోగదారుల నుంచి వస్తున్నాయి. ఓలా స్కూటర్లు కొనుగోలు చేసిన వారు బహిరంగంగానే కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని కల్బురగిలో ఓ వ్యక్తి తన స్కూటర్ ను ఓలా షోరూం ముంగిట దహనం చేశాడు. ఇదే విధంగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహాలో తన ఆవేదను వెళ్లగక్కారు.
మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఉంది. వాటిని అందిపుచ్చుకోవడంలో కంపెనీలు కూడా ఒక అడుగు ముందే ఉన్నాయి. అలాంటి కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్ ఒకటి. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. కొన్నేళ్లుగా ఇది తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అందులోని అత్యాధునిక సాంకేతికత, ఫీచర్లు, రేంజ్ వంటివి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో చాలా నెగిటివ్ కామెంట్లు ఓలా స్కూటర్ల వినియోగదారుల నుంచి వస్తున్నాయి. ఓలా స్కూటర్లు కొనుగోలు చేసిన వారు బహిరంగంగానే కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని కల్బురగిలో ఓ వ్యక్తి తన స్కూటర్ ను ఓలా షోరూం ముంగిట దహనం చేశాడు. ఇదే విధంగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహాలో తన ఆవేదను వెళ్లగక్కారు. స్కూటర్ కు ఓ ప్లకార్డును తగిలించి.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
“Ola ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಮ ಜೀವನ ಗೋಳು “ I will Be Spreading Awareness Against Ola Electric 😁🤌🏻 Thanks For The Idea @UppinaKai Sir 🫡 #DontBuyOla#OlaElectric pic.twitter.com/bcVQ3i6P3K
— ನಿಶಾ ಗೌರಿ 💛❤ (@Nisha_gowru) September 12, 2024
పెరుగుతున్న వ్యతిరేకత..
ఓలా స్కూటర్లపై వినియోగదారుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ముఖ్యంగా సాంకేతికంగా చాలా ఇబ్బందులు వస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇదే విధంగా బెంగళూరుకు చెందిన మహిళ తన వాహనం ముందు భాగంలో వేలాడుతున్న ప్లకార్డుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తనకు @UppinaKai నుంచి ఆలోచన వచ్చిందని, క్యాప్షన్లో #DontBuyOla వంటి హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించారు. ఆమె ప్లకార్డుపై ఇలా రాశారు – “ప్రియమైన కన్నడిగులారా, ఓలా పనికిరాని ద్విచక్ర వాహనం. మీరు ఒకదాన్ని కొనుగోలు చేస్తే, అది మీ జీవితాన్ని కష్టతరం చేస్తుంది. దయచేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయవద్దు.” చివరలో ఆమె తనను తాను విరక్తి చెందిన ఓలా కస్టమర్ గా చెప్పుకున్నారు.
విసుగు చెందిన ఓలా కస్టమర్..
“ఓలా ఎలక్ట్రిక్ కి వ్యతిరేకంగా నేను అవగాహన కల్పిస్తాను” అని ఆమె పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చారు. ఆ మహిళ, తన మునుపటి ఎక్స్ పోస్ట్ ప్రకారం, తన భర్త నుంచి స్కూటర్ ను బహుమతిగా అందుకుంది. ఆ పోస్ట్ లో ఆమె స్కూటర్ పని చేయని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఆమె క్యాప్షన్ ఇలా ఉంది- “నా భర్త నాకు దీనికి బహుమతిగా ఇచ్చారు కాబట్టి.. ఆయనే చాలా రిస్క్ తీసుకుని ఈ డబ్బా బండిని షోరూమ్ వైపు నెట్టారు. అయితే అది షోరూం వెళ్లడానికి రెండు గంటల సమయం తీసుకుంది. మధ్య మధ్యలో ఆగుతూ.. సాగుతూ చివరకు ఇంద్రానగర్ లోని షోరూం వద్దకు చేరుకుంది.. షోరూం వారు పరిశీలించి సాఫ్ట్ వేర్ సమస్యగా నిర్ధారించారు’’
ఫిర్యాదు ఇలా..
నిషా సి. శేఖర్ అనే మహిళ బెంగుళూరులోని ‘జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్’ ముందు వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 35 ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వ్యతిరేక పార్టీకి నోటీసు కూడా పంపారు. స్కూటర్ను రిపేర్ చేయడానికి సర్వీస్ సెంటర్ ఆమె వెళ్లడం గురించి కూడా వినియోగదారు పోస్ట్ చేసారు, కానీ సాంకేతిక నిపుణులు 1.5 గంటలు కష్టపడినా సరిచేయలేకపోయారు. అయితే ఇంటికి తిరిగి తీసుకురావడంతో స్కూటర్ మళ్లీ పనిచేయడం ప్రారంభించిందని ఆమె పేర్కొనడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..