FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలపై 9.75 శాతం వడ్డీ ఆఫర్

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ (ఎన్ఈఎస్ఎఫ్‌బీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఇటీవల 9.75%కి పెంచింది. ఇది ఎఫ్‌డీలపై దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల దాని కస్టమర్లకు అత్యంత విలువైన రాబడిని అందిస్తుంది. ఎన్ఈఎస్ఎఫ్‌బీ సాధారణ ప్రజలకు 9.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 9.75 శాతం రేట్లను అందిస్తుంది.

FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలపై 9.75 శాతం వడ్డీ ఆఫర్
Senior Citizen
Follow us

|

Updated on: Jun 22, 2024 | 5:00 PM

భారతదేశంలో పెరుగుతున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు తాజా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద బ్యాంకులకు పోటీగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ (ఎన్ఈఎస్ఎఫ్‌బీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఇటీవల 9.75%కి పెంచింది. ఇది ఎఫ్‌డీలపై దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల దాని కస్టమర్లకు అత్యంత విలువైన రాబడిని అందిస్తుంది. ఎన్ఈఎస్ఎఫ్‌బీ సాధారణ ప్రజలకు 9.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 9.75 శాతం రేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈఎస్ఎఫ్‌బీ తాజా వడ్డీ రేట్ల గురించి మరిన్న వివరాలను తెలుసుకుందాం. 

ఎన్ఈఎస్ఎఫ్‌బీ సవరించిన ఎఫ్‌డీ రేట్లు బ్యాంకింగ్ రంగంలో అత్యధిక రేట్లుగా ఘనతను సాధించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో ఈ పెరుగుదల కస్టమర్‌లకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లకు వారి ఎఫ్‌డీలపై ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని సంపాదించే సామర్థ్యాన్ని అందిస్తుంది . ఎఫ్‌డీలకు సంబంధించిన అధిక లిక్విడిటీ, సులభమైన ఎన్‌క్యాష్‌బిలీటీ కారణంగా మనీ మార్కెట్ పోలిస్తే మెరుగైన రాబడితో పాటు ఈ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ నికరమైన ఆదాయాన్ని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్ల పెంపు గురించి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ కుమార్ కల్రా మాట్లాడుతూ పెరిగిన వడ్డీ రేట్లు వినియోగదారులకు వివిధ ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను అందించడానికి ఉద్దేశించి రూపొందించామని వివరించారు.  వడ్డీ రేట్లను సవరించడం ద్వారా రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో సమర్థవంతంగా ఉంటూనే బ్యాంక్ తన కస్టమర్‌లకు పోటీతత్వ రాబడిని అందిస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్ఈఎస్ఎఫ్‌బీ వడ్డీ రేట్లు ఇలా

  • 181 – 365 రోజుల మధ్య ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ
  • 366 – 545 రోజుల మధ్య ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 9.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీ
  • 546 – 1111 రోజుల మధ్య ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 9.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.75 శాతం వడ్డీ
  • 1112 – 1825 రోజుల మధ్య ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీ
  • 1826 – 3650 రోజుల మధ్య ఎఫ్‌డీలకు సాధారణ ప్రజలకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం వడ్డీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరద బాధితులకు 'మంచు' ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి..
వరద బాధితులకు 'మంచు' ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి..
గ్రేటర్ హైదరాబాద్‌లో పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ బ్యాన్..!
గ్రేటర్ హైదరాబాద్‌లో పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ బ్యాన్..!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
మనదేశంలోని ఈ పర్వతాలపై ట్రెక్కింగ్ చాలా కష్టం..! ఒక సాహసయాత్రే..
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
వాయమ్మో.! వంటలక్క ఆస్తులు ఇన్ని కోట్లా.? విలువ ఎంతో తెలిస్తే
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
ఆ రాశుల వారికి అధికార, గృహ, ఉద్యోగ యోగాలు
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
లక్ష్యం ఒక్కటే.. కబ్జా చేస్తే ఊరుకునేదీ లేదుః రంగనాథ్
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బిగ్ బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరు బయటికే!
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
బెస్ట్ ఆఫీస్ చైర్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 67శాతం వరకూ తగ్గింపు..
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్ హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభం