పోస్టాఫీస్ సూపర్ స్కీం.. రిస్క్ లేకుండా ఏడాదికి రూ. లక్ష మీ సొంతం.. వివరాలు ఇవిగో

డబ్బు అనేది ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. అయితే ఈకాలంలొ మనం ఎంత కష్టపడి సంపాదించినా.. వచ్చిన ఆదాయం మాత్రం ఏదొక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించేవారు చాలామందే ఉన్నారు.

పోస్టాఫీస్ సూపర్ స్కీం.. రిస్క్ లేకుండా ఏడాదికి రూ. లక్ష మీ సొంతం.. వివరాలు ఇవిగో
Post Office
Follow us

|

Updated on: Jun 24, 2024 | 5:55 PM

డబ్బు అనేది ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. అయితే ఈకాలంలొ మనం ఎంత కష్టపడి సంపాదించినా.. వచ్చిన ఆదాయం మాత్రం ఏదొక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించేవారు చాలామందే ఉన్నారు. అందుకే సంపాదించిన సొమ్ములో.. నెలనెలా ఎంతోకొంత సేవింగ్స్ కింద దాచిపెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దీని కోసమే అటు బ్యాంకులు, ఇటు పోస్టాఫీసుల్లో వివిధ రకాల సేవింగ్స్ స్కీంలు అందుబాటులోకి వచ్చాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ప్రభుత్వ సెక్యూరిటీతో ఈ పధకాలు లభిస్తున్నాయి. మరి వీటిల్లో మీరు పెట్టుబడి పెడితే.. మంత్లీ ఇన్ కమ్ కింద మీకు ఆదాయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం.

భవిష్యత్తు అవసరాల కోసం నెలలో కొంత అమౌంట్ సేవింగ్స్ కోసం దాచిపెట్టేవారి కోసం పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. ఈ స్కీంలో చేరే లబ్ధిదారులు సింగిల్, జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మైనర్లకు కూడా ఈ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసే వెసులుబాటు ఉంది. ఇక వారి ఆర్ధిక లావాదేవీలను గార్డియన్లుగా పెట్టినవారు చూసుకోవచ్చు.

ఈ స్కీం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 – ఈ పధకంలో 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసిన నెల తర్వాత నుంచి మెచ్యూరిటీ అయ్యే దాకా వడ్డీ వస్తూనే ఉంటుంది.

– ఈ స్కీంలో కనీసం వెయ్యితో అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే గరిష్టంగా సింగిల్ అకౌంట్ ఉన్నవారు రూ. 9 లక్షల వరకు.. ఇక జాయింట్ అకౌంట్ ఉన్నవారు రూ. 15 లక్షల వరకు ఇందులూ పెట్టుబడి పెట్టొచ్చు. మైనర్ల అకౌంట్ లిమిట్ వేరేగా ఉంటుంది.

– ఇక డిపాజిట్ చేసిన దగ్గర నుంచి ఒక సంవత్సరం వరకు విత్ డ్రా చేయకూడదు. అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా.. 3 సంవత్సరాల ముందు లోపల అకౌంట్ క్లోజ్ చేస్తే.. ప్రిన్సిపాల్ అమౌంట్ నుంచి 2 శాతం కట్ అవుతుంది.

– సంబంధిత పోస్టాఫీసులో పాస్ బుక్, అప్లికేషన్ ఫామ్ అందజేయడం ద్వారా మినిమమ్ 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఈ స్కీం అకౌంట్‌ క్లోజ్‌ చేసుకోవచ్చు.

– ఒకవేళ అకౌంట్ హోల్డర్ మినిమమ్ మెచ్యూరిటీ సమయం అయిన 5 ఏళ్లలోపు మరణిస్తే కూడా క్లోజ్‌ చేయవచ్చు. ఇక నామినీగా ఉన్నవారికి ఆ మొత్తం అందుతుంది. రీఫండ్‌ చేసిన ముందు నెల వరకు వడ్డీ వస్తుంది. ఉదాహరణకు ఈ స్కీంలో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతీ నెలా రూ. 9250 వరకు వడ్డీ పొందొచ్చు.

ఇది చదవండి: ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!