Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Refund: ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. కారణమిదేనేమో.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం..

ఆదాయపు పన్ను రీఫండ్ అందకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. ఆ హోల్డ్ అప్‌కు కారణమేమిటో తెలుసుకోవాలి. అలాగే మీ డబ్బును ట్రాక్ చేయడానికి చర్యలను ప్రారంభించాలి. ముందుగా ఐటీ డిపార్ట్‌మెంట్ ను సంప్రదించాలి. వారు అదనపు సమాచారం కోరితే వెంటనే అందజేయాలి.

ITR Refund: ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ రాలేదా.. కారణమిదేనేమో.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం..
Itr
Follow us
Madhu

|

Updated on: Jun 22, 2024 | 2:23 PM

ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయాలి. తమ ఆదాయం, ఖర్చుల వివరాలను తెలియజేస్తూ ఆదాయపు పన్ను శాఖకు వివరాలు అందించాలి. దాన్నిపరిశీలించిన అనంతరం, వివరాలన్నీసరిపోతే మీకు పన్ను రీఫండ్ వస్తుంది. అయితే చాలామందికి ఐటీఆర్ అందజేసి, చాలా రోజులు గడిచినా రీఫండ్ రాదు. దానికి పలు కారణాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

పలు కారణాలు..

ఆదాయపు పన్ను రీఫండ్ అందకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. ఆ హోల్డ్ అప్‌కు కారణమేమిటో తెలుసుకోవాలి. అలాగే మీ డబ్బును ట్రాక్ చేయడానికి చర్యలను ప్రారంభించాలి. ముందుగా ఐటీ డిపార్ట్‌మెంట్ ను సంప్రదించాలి. వారు అదనపు సమాచారం కోరితే వెంటనే అందజేయాలి.

ఐటీఆర్ ప్రాసెస్..

మీ ఐటీఆర్ ను ప్రాసెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు కొంత సమయం పడుతుంది. అయితే బాగా ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం మీరు ఐటీఆర్ వెబ్ సైట్‌ను సందర్శించి మీ రీఫండ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే మీకు రిటర్న్స్ అందుతాయి. మీ అర్హత నిర్ధారించబడిన తర్వాత దాదాపు నాలుగు వారాలలో వాపసు సొమ్ములు జమ అవుతాయి.

బ్యాంక్ ఖాతా వివరాలు..

ఐటీఆర్ రీఫండ్ ప్రాసెస్‌కు ప్రధానంగా మీ బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉండాలి. బ్యాంక్ ఖాతాలో, పాన్ కార్డులో మీ పేరు వివరాలు సక్రమంగా ఉండాలి. ఖాతా వివరాలు తప్పుగా ఉంటే మాత్రం మీకు రిటర్న్స్ జమ కావు. కాబట్టి మీ బ్యాంకు ఖాతాను ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరించిందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. దానికి ఈ కింది తెలిపిన పద్ధతులు పాటించాలి. ముందుగా ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్‌ను సందర్శించాలి. దానిలో లాగిన్ అయ్యి మై ప్రొఫైల్‌లోకి ప్రవేశించాలి. అక్కడ మై బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ను ఎంచుకోండి. ఖాతా నంబర్ సక్రమంగా ఉందో లేదో పరిశీలించండి. అవసరమైతే మళ్లీ ఎంటర్ చేయండి.

ఐటీఆర్ ఈ-ధ్రువీకరణ..

మీ ఐటీఆర్ రిటర్న్స్ కు ఈ-ధ్రువీకరణ చాలా అవసరం. మీకు డబ్బులు వాపసు రావడానికి ఇదే కీలకం. మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల లోపు ఈ-ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి కావాలి. ఇదే మీ వాపసు ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

బకాయిలు..

గత ఆర్థిక సంవత్సరం నుంచి పరిష్కారం కాని బకాయిలు ఉంటే మీ ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కావచ్చు. వాపసు డబ్బులను ఆ బకాయిలను తీర్చడానికి ఉపయోగిస్తారు. ఈ సమాచారాన్ని ఇంటీమేషన్ నోటీసు ద్వారా మీకు అధికారులు తెలియజేస్తారు.

పరిశీలన..

ఆదాయపు పన్ను శాఖ కొన్ని రిటర్న్‌లను పరిశీలన కోసం ఎంచుకోవచ్చు. వాటిలో మీ ఐటీఆర్ ఉంటే ఆలస్యం జరుగుతుంది. ఆ అసెస్‌మెంట్ పూర్తయ్యే వరకూ జాప్యం కలగవచ్చు.

సరిపోలకపోతే..

మీ రిటర్న్స్ లో నమోదు చేసిన టీడీఎస్ వివరాలకూ, అలాగే ఫాం 26 ఏఎస్ వివరాలు సరిపోవాలి. అలా జరగని పక్షంలో ఐటీఆర్ రీఫండ్ లేటవుతుంది.

సాంకేతిక కారణాలు..

సర్వర్ సమస్యలు, బ్యాక్‌లాగ్‌ల వంటి సాంకేతిక సమస్యల కారణంగా వాపసు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో స్పష్టత కోసం ఐటీడీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. లేకపోతే ఇమెయిల్ ను పంపించాలి. ఆలస్యం ఇంకా కొనసాగితే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..