AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Pension Scheme: బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. పన్ను మినహాయింపులను పెంచుతూ నిర్ణయం

సాధారణ ప్రజలను కూడా పింఛన్‌ పథకాల వైపు ఆకర్షితులను చేయడానికి కేంద్రం గతంలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే క్రమేపి ఈ పథకాన్ని ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌ పెట్టుబడులపై పన్ను మినహాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కొత్త పన్ను విధానం కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యజమానుల వాటాపై పన్ను మినహాయింపులను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

National Pension Scheme: బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. పన్ను మినహాయింపులను పెంచుతూ నిర్ణయం
Nps
Nikhil
|

Updated on: Jul 28, 2024 | 4:44 PM

Share

భారతదేశంలో సాధారణంగా పదవీ విరమణ పథకాలు అంటే ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఉద్యోగులకు మాత్రం ఈపీఎఫ్‌ అందుబాటులో ఉంటుంది. అయితే సాధారణ ప్రజలను కూడా పింఛన్‌ పథకాల వైపు ఆకర్షితులను చేయడానికి కేంద్రం గతంలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే క్రమేపి ఈ పథకాన్ని ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌ పెట్టుబడులపై పన్ను మినహాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కొత్త పన్ను విధానం కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యజమానుల వాటాపై పన్ను మినహాయింపులను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ పథకంలో పెట్టుబడిపై పన్ను మినిహాయింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన 2024-25 బడ్జెట్ ప్రసంగంలో సామాజిక భద్రతా ప్రయోజనాలను మెరుగుపరచడానికి ఎన్‌పీఎస్‌ కోసం యజమానులు చేసే వ్యయాన్ని ఉద్యోగి జీతంలో 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుని, ప్రైవేట్ సెక్టార్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలలోని ఉద్యోగుల ఆదాయం నుంచి జీతంలో 14 శాతం వరకు ఈ ఖర్చును మినహాయించాలని ప్రతిపాదించారు. ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌కి యజమానికి సంబంధించిన సహకారంపై బేసిక్ జీతంలో 4 శాతం అదనపు తగ్గింపు అందించడం వల్ల ఈ పథకంలో చేరమని ఉద్యోగులను ఆయా కంపెనీలు ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా పెద్ద మొత్తంలో పదవీ విరమణ కార్పస్‌ను కూడగట్టుకోవడానికి కేంద్రం చర్యలు పెట్టుబడిదారులకు అనుమతినిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ అనంతరం సంతోషం జీవించవచ్చని వివరిస్తున్నారు.  అలాగే ఎన్‌పీఎస్ పెట్టుబడులు గణనీయమైన పన్ను ప్రయోజనాలతో వస్తాయి. పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గించడంతో మొత్తం పన్ను బాధ్యతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులను పొదుపు బాట పట్టించడానికి ఈ చర్యలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి మైనర్‌ల కోసం తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారంతో ‘ఎన్‌పీఎస్-వాత్సల్య’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ప్లాన్‌ను సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి